ది ఘోస్ట్ డిజాస్టర్ తో బాగా డీలా పడిన అక్కినేని అభిమానుల ఆశలన్నీ రాబోయే అఖిల్ ఏజెంట్ మీదే ఉన్నాయి. ఎప్పుడో నెలల క్రితం ఆగస్ట్ 12 విడుదలన్నారు. తీరా చూస్తే షూటింగ్ బ్యాలన్స్ ఉండటంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం అవసరం పడటంతో వాయిదా వేశారు. సరే పెద్ద సినిమాలన్నాక ఇవన్నీ సహజమే కాబట్టి కొత్త డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఎంతకీ ఆ నిరీక్షణ ఫలించడం లేదు. ఏజెంట్ రిలీజ్ కు సంబంధించిన అటు ప్రొడక్షన్ హౌస్ నుంచి కానీ ఇటు హీరో దర్శకుడి వైపు నుంచి కానీ ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు. అసలు డిసెంబర్ లో వస్తుందానే అనుమానాలు ఎక్కువయ్యాయి.
తాజా సమాచారం మేరకు ఏజెంట్ ఈ ఏడాది వచ్చే ఛాన్స్ లేనట్టే. జనవరికి వెళ్లాలని నిర్మాత సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. అయితే సంక్రాంతి బరి ఇప్పటికే యమా వేడిగా ఉంది. ఆది పురుష్, వాల్తేర్ వీరయ్య, వారసుడు, తునివు ఆల్రెడీ లాక్ చేసుకున్నాయి. వీటికి థియేటర్లు అడ్జస్ట్ చేయడమే పెద్ద సవాల్. అలాంటిది ఏజెంట్ రావడం లేనిపోని రిస్క్ అవుతుంది. పైగా చిరంజీవితోనే భోళా శంకర్ నిర్మిస్తున్న ఏజెంట్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర నేరుగా మెగాస్టార్ తో ఢీ కొట్టే సాహసం చేస్తారనుకోలేం. పైగా అంత టఫ్ కాంపిటీషన్ పడిన పరిస్థితుల్లో.
సో రిపబ్లిక్ డేకు వెళ్లడం తప్ప వేరే ఆప్షన్ ఉండకపోవచ్చు. కాకపోతే అప్పుడు షారుఖ్ ఖాన్ పఠాన్ కాచుకుంది ఉంది. తెలుగు మార్కెట్ వరకు దానికి భయపడాల్సిన అవసరం లేదు కానీ ఏజెంట్ సైతం ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి హిందీ మార్కెట్ లో బాద్షా వల్ల దెబ్బ తినాల్సి వస్తుంది. ఈ గోలంతా ఎందుకులే అనుకుంటే శుభ్రంగా ఏ వేసవికి షిఫ్ట్ కావడం ఉత్తమం. చూస్తుంటే అదే జరిగేలా కనిపిస్తోంది. ఇప్పటిదాకా టీజర్ తప్ప ఎలాంటి ప్రమోషనల్ మెటీరియల్ బయటికి రాలేదు. మలయాళం మెగాస్టర్ మమ్ముట్టి కూడా కీలక పాత్ర చేస్తున్నారు కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకుని తేదీని డిసైడ్ చేయాల్సి ఉంటుంది.
This post was last modified on October 15, 2022 1:51 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…