ఈ ఏడాది మొత్తానికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా చెప్పుకుంటున్న బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ బాక్సాఫీస్ రన్ ని పూర్తి చేసుకుంది. రెండు వారాల క్రితమే నెమ్మదించినప్పటికీ నేషనల్ సినిమా డేతో పాటు ఇతరత్రా సందర్భాలను వాడుకుని టికెట్ రేట్లపై ప్రత్యేక డిస్కౌంట్ ఇవ్వడంతో వసూళ్లు మూడు వందల కోట్ల దాకా వెళ్లాయి. ఏదో బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ రేంజ్ లో ఆడుతుందని వేల కోట్లు తెస్తుందని ఆశించిన నిర్మాత కరణ్ జోహార్, బాలీవుడ్ మీడియా వర్గాలకు నిరాశ తప్పలేదు. దర్శకుడు అయాన్ ముఖర్జీ కథనంలో చేసిన పొరపాట్ల వల్ల ఈ సబ్జెక్టుకు తగ్గ రీచ్ అయితే ఖచ్చితంగా రాలేదు.
ఇప్పుడీ విజువల్ గ్రాండియర్ ఓటిటి ప్రీమియర్ కు రెడీ అవుతోంది. డిజిటల్ వర్గాల కథనం ప్రకారం దీపావళి కానుకగా డిస్నీ హాట్ స్టార్ లో అక్టోబర్ 23న స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అంటే దీపావళికి ఒక్క రోజు ముందున్న మాట. సరిగ్గా ఆరు వారాల గ్యాప్ తో థియేటర్ నుంచి స్మార్ట్ స్క్రీన్ కు షిఫ్ట్ అవుతోంది బ్రహ్మాస్త్ర. అంటే యాభై రోజులు దాటకుండానే వస్తోందన్న మాట. అమీర్ ఖాన్ తో పాటు ఈ మధ్య హిందీ నిర్మాతలు తమ సినిమాలు అంత త్వరగా ఓటిటిలో రావని పదే పదే చెబుతున్నారు కానీ మొన్న లాల్ సింగ్ చడ్డా ఇప్పుడీ బ్రహ్మాస్త్ర ఊహించిన టైంకన్నా ముందుగానే వస్తున్నాయి.
అఫీషియల్ గా ఇంకా చెప్పలేదు కానీ ఆల్మోస్ట్ లాక్ అయ్యిందని ఇన్ సైడ్ సోర్స్ టాక్. బ్రహ్మాస్త్ర సెకండ్ పార్ట్ రావడానికి ఇంకో రెండేళ్లకు పైగా పట్టేలా ఉంది. కాకపోతే బాహుబలి రేంజ్ లో దీని సీక్వెల్ మీద అంత హైప్ ఏమీ రాలేదు. ఇటీవలే కరణ్ జోహార్ సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పడానికి కారణం బ్రహ్మాస్త్ర మీద వచ్చిన నెగిటివిటీనే అంటున్న వాళ్ళు లేకపోలేదు. ఇంకో రెండు భాగాలు రావాలి కాబట్టి వాటి స్క్రిప్ట్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంత రాజమౌళి సమర్పకులుగా వ్యవహరించినా ఆయనను దాటే కల మాత్రం అయాన్ టీమ్ కి కలగానే మిగిలిపోయింది.
This post was last modified on October 13, 2022 9:21 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…