తెలుగులో ఓటిటి కంటెంట్ అంటూ రీజనల్ ఫీలింగుతో పుట్టుకొచ్చిన డిజిటల్ స్ట్రీమింగ్ యాప్ ‘ఆహా’. వచ్చిన కొత్తలో అందరూ ఈ యాప్ పెనుసంచలనం అవుతుందని అనుకున్నారు కాని, రాను రాను యాప్ మీద మక్కువపోతోంది. కారణం ఏంటంటే.. ఎక్కువగా తెలుగు డబ్బింగ్ సినిమాలు పెట్టడం, లేదంటే తెలుగు యుట్యూబ్ ఛానల్స్ లో వచ్చే కంటెంట్ నే మంచి కెమెరాలతో తీయించి వెబ్ సిరీస్ లుగా రిలీజ్ చేయడం వలన.. ఆహా మీద ఇంట్రెస్ట్ రావట్లేదు. కాకపోతే మధ్యమధ్యలో డ్యాన్స్ షోలు, ఇంటర్యూలు అంటూ సగటు తెలుగు ఎంటర్టయిన్మెంట్ ఛానల్ తరహాలో కొన్ని విన్యాశాలు చేస్తున్నారు కాని, అవి కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయ్. ఈ టైములో ఆహాకు బీభత్సమైన బ్రాండ్ ఇమేజ్ తీసుకొస్తున్న ఏకైక ప్రోగ్రామ్.. అన్ స్టాపబుల్.
నందమూరి బాలకృష్ణను హోస్టుగా తీసుకోవాలనే ఐడియా అసలు అల్లు అరవింద్ కు ఎందుకొచ్చిందో తెలియదు కాని, ఆ షో ప్రారంభించాక ఆహా ఇమేజ్ మాత్రం అమాంతం పెరిగిపోయింది. అసలు బాలయ్య అంత ఫన్ గా మాట్లాడతారని కాని, ఆయనలో ఇలాంటి ఒక ఎమోషనల్ కోణం ఉందనికాని, బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు. అందుకేనేమో ఆహాలో అన్ స్టాపబుల్ చూసేసరికి ఆయనకు చాలామంది ఫిదా అయిపోయారు. ఫ్యాన్స్ గా మారిపోయారు. ఆయన ఇమేజ్ ఒక్క దెబ్బతో మారిపోయింది. నిజానికి అఖండ సినిమాకు ఆ రేంజులో క్రేజ్ రావడానికి ఈ టాక్ షో ద్వారా ఆయనకు దగ్గరైనా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కారణమే అని చెప్పొచ్చు. అయితే ‘ఆహా’కి మాత్రం బాలయ్య అప్పణంగా దొరికేశారంటూ ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. ఎందుకో తెలుసా?
నిజానికి మొదటి సీజన్ హిట్టవ్వగానే రెండో సీజన్ కు ఏ హోస్ట్ అయినా కూడా భారీగా కోట్ చేస్తారు. అత్యంత ప్రజాదారణ పొందిన షో కాబట్టి.. ప్రొడ్యూసర్లకు కూడా భారీ పేమెంట్ ఇవ్వడం తప్పిస్తే వేరే దారుండదు. కాని బాలకృష్ణ మాత్రం మొదటి సీజన్ హోస్ట్ చేయడానికి ఎంత తీసుకున్నారో అంతకే ఇప్పుడు అన్ స్టాపబుల్ రెండో సీజన్ కూడా హోస్ట్ చేస్తున్నారట. ఒక ప్రక్కన ఆహా వాళ్లు ఈ ప్రోగ్రామ్ కోసం రకరకాల స్పాన్సర్ల దగ్గర భారీగానే ఛార్జ్ చేస్తున్నారు. ఏకంగా బాలయ్య కోసం మ్యాన్షన్ హౌస్ వంటి బ్రాండ్ వచ్చేసిందంటే చూడండి. కాని బాలయ్య మాత్రం ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకోకపోవడం ఆయన ఎథిక్స్ కు నిదర్శనం.
This post was last modified on October 13, 2022 11:28 am
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…