కరోనా విజృంభిస్తున్న సమయంలో షూటింగ్ చేయడం ఎంత ప్రమాదకరమో సీరియల్ షూటింగ్స్ లోనే తెలిసిపోయింది. ముఖ్యంగా మాస్క్ లేకుండా నటించాల్సిన నటీనటులకు ఇది అత్యంత ప్రమాదకరంగా మారింది. అయితే ఇంకా చాలా భాగం షూటింగ్ చేయాల్సిన సినిమాలను ఇప్పుడే మొదలు పెట్టడం లేదు కానీ… కొన్ని రోజుల పాటు షూటింగ్ చేస్తే పూర్తవుతుంది అనే సినిమాలకు నిర్మాతలు వివిధ ఐడియాలతో వస్తున్నారు.
సల్మాన్ ఖాన్ సినిమా రాధే షూటింగ్ కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ షూటింగ్ పూర్తి చేయాలంటే వీలయినంత పెద్ద స్థలం కావాలని భావించి సల్మాన్ ఖాన్ ఒక స్టూడియో మొత్తం బ్లాక్ చేసాడట. దీనివల్ల మనుషుల మధ్య వీలయినంత దూరం ఉంటుందని, రిహార్సల్స్ కి కూడా స్క్రీన్స్ వేసి మేనేజ్ చేయవచ్చునని, మెయిన్ షాట్ మినహా మరేదీ దగ్గరగా ఉంది చేయాల్సిన పని లేదని, స్టూడియో అంతా తమ అధీనంలో ఉంటుంది కనుక బయట నుంచి రాకపోకలు పూర్తిగా నియంత్రించవచ్చునని భావిస్తున్నారు.
ఇందుకోసం ఖర్చు పెరిగినా కానీ, షూటింగ్ పూర్తయి, సినిమా ఎప్పుడంటే అప్పుడు రిలీజ్ చేసుకోవడానికి వీలుంటుందని భాయ్ ఆలోచన. రాధే షూటింగ్ ఇలా సజావుగా సాగినట్లయితే మిగిలిన భారీ చిత్రాలు కూడా ఈ రూట్లో వెళ్లే అవకాశం ఉంది.
This post was last modified on July 9, 2020 7:07 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…