Movie News

కలెక్షన్ల గురించి గాడ్ ఫాదర్ నిర్మాత

ప్రస్తుతం ఇండస్ట్రీతో పాటు ట్రేడ్ వర్గాల్లో గాడ్ ఫాదర్ కలెక్షన్ల మీద పెద్ద చర్చే జరుగుతోంది. దసరా పండగతో మొదలుపెట్టి అయిదు రోజుల పాటు నాన్ స్టాప్ వసూళ్లతో దుమ్ము రేపిన ఈ మెగా హిట్ ఉన్నట్టుండి సోమవారం నుంచి విపరీతంగా డ్రాప్ అవ్వడం ఫ్యాన్స్ ని ఆశ్చర్యానికి గురి చేసింది. 90 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగితే ఇప్పటిదాకా వచ్చింది 60 కోట్లకు దగ్గరలో. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే దాన్ని రీచ్ కావడం దాదాపు అసాధ్యమే. అదే జరిగితే కమర్షియల్ సూత్రాల ప్రకారం ఈ సినిమాని ఫ్లాప్ గానే పరిగణించాల్సి ఉంటుంది. ఇక్కడే నిర్మాత ఎన్వి ప్రసాద్ ఎంట్రీ ఇచ్చారు.

అసలు తామెవరికి సినిమా అమ్మలేదని స్వంతంగా రిలీజ్ చేసుకున్నామని తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాండమైన కలెక్షన్లు వస్తున్నాయని మీడియాకు పంపిన ప్రత్యేక నోట్ లో పేర్కొన్నారు. అంతే కాదు యుఎస్ లో 1 మిలియన్ దాటేసి ఇంకా స్ట్రాంగ్ గా రన్ అవుతోందని చెప్పుకొచ్చారు. అంతా బాగానే ఉంది కానీ ఇంత కాన్ఫిడెంట్ గా ఉండి ఓన్ రిలీజ్ చేసుకున్నప్పుడు అదేదో ముందస్తు విడుదల వేడుకలోనో లేదా ఇటీవలే జరిగిన సక్సెస్ మీట్ లోనో చెప్పేసి ఉంటే అనుమానాలకు చర్చలకు అప్పుడే బ్రేక్ పడేది. కానీ గణనీయమైన తగ్గుదల కనిపించాక క్లారిటీ ఇవ్వడం అనూహ్యం.

స్వంతంగా రిలీజ్ చేసుకోవడం తప్పేం కాదు. పైపెచ్చు ఈ పద్ధతి వల్ల బయ్యర్లు ఎలాంటి రిస్క్ లేకుండా సేఫ్ అవుతారు. కాబట్టి ముందే ఓపెన్ అయితే ఇన్ని ప్రచారాలు జరిగేవి కాదు. అసలు ఆ తొంబై కోట్ల ఫిగర్ ని బయటికి వదిలింది ఎవరు, దాని మీద వారం రోజులు అంత డిస్కషన్ జరుగుతున్నా అదేమీ పట్టించుకోకుండా ఇప్పుడు సెలవివ్వడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇదంతా బాగానే ఉంది కానీ ఇంతకీ గాడ్ ఫాదర్ కు ఎంత లాభాలు వచ్చాయి, నిర్మాణానికి, డిస్ట్రిబ్యూషన్ కి, ప్రమోషన్లు పబ్లిసిటీకి అయిన ఖర్చు, వచ్చిన రాబడి గురించి ఫుల్ రన్ అయ్యాక చెబితేనైనా గాడ్ ఫాదర్ ఏ రేంజ్ హిట్టనేది క్లారిటీ వచ్చేస్తుంది. చూద్దాం

This post was last modified on October 13, 2022 8:55 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బుక్ మై షోలో ‘వీరమల్లు’

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కొన్నేళ్ల నుంచి విడుదల కోసం ఎదురు చూస్తున్న సినిమా.. హరిహర వీరమల్లు. పవన్…

2 hours ago

క్లాసిక్ సీక్వెల్ – రామ్ చరణ్ డిమాండ్

35 సంవత్సరాల తర్వాత విడుదలవుతున్న జగదేకవీరుడు అతిలోకసుందరిని ఆస్వాదించడం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారని అడ్వాన్స్ బుకింగ్స్ తేటతెల్లం చేశాయి.…

2 hours ago

ఇంటరెస్టింగ్ డే : శ్రీవిష్ణు VS సామ్

కొత్త శుక్రవారం వచ్చేసింది. హిట్ 3 ది థర్డ్ కేస్ తో మే నెలకు బ్రహ్మాండమైన బోణీ దొరికాక ఇప్పుడు…

3 hours ago

పాక్ దొంగ దారి!… యుద్ధం మొదలైనట్టే!

దాయాదీ దేశాలు భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధం మొదలైపోయిందనే చెప్పాలి. ఈ మేరకు గురువారం యుద్ధం జరుగుతున్న తీరుకు…

11 hours ago

శత్రు దుర్బేధ్యం భారత్… గాల్లోనే పేలిన పాక్ మిస్సైళ్లు

ఓ వైపు పాకిస్తాన్ కుట్రపూరిత వ్యూహాలు, మరోవైపు ఆ దేశం పెంచి పోషిస్తున్న ఉగ్రవాద దాడులు… వెరసి నిత్యం భారత…

11 hours ago

ఈ అమ్మాయి యాక్టరే కాదు.. డాక్టర్ కూడా

డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా.. ఒకప్పుడు చాలామంది హీరోలు, హీరోయిన్లు ఈ మాట చెప్పేవారు. ఐతే గతంలో సినిమాల్లోకి రావాలంటే…

12 hours ago