లెజెండరీ దర్శకులు మణిరత్నం చివరి బ్లాక్ బస్టర్ ఎప్పుడంటే వెంటనే గుర్తు తెచ్చుకోవడం కష్టం. 2000 సంవత్సరంలో సఖి సూపర్ సక్సెస్ అయ్యాక మళ్ళీ ఆ స్థాయి విజయం దక్కలేదు. ఓకే బంగారం హిట్ అనిపించుకుంది అన్ని భాషల్లో ఆయన రేంజ్ లో ఆడలేదు. యువ, విలన్ కు టెక్నికల్ గా ప్రశంసలు దక్కాయి కానీ కమర్షియల్ గా భారీ డిజాస్టర్లవి. ఇక కడలి, చెలియా గురించి గుర్తుచేసుకోకపోవడం ఉత్తమం. కానీ ఇప్పుడు పొన్నియన్ సెల్వన్ 1 తర్వాత అంతా మారిపోయింది. ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు వందల కోట్ల గ్రాస్ అందుకున్న విజువల్ క్లాసిక్ గా దీన్ని తమిళ జనం మాములుగా ఆదరించలేదు.
తెలుగుతో సహా ఇతర వెర్షన్లు ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయకపోయినా మణిరత్నం టేకింగ్, విజువల్స్, కలర్ఫుల్ క్యాస్టింగ్ పుణ్యమాని మరీ దారుణంగా దెబ్బ తినకుండా గట్టెక్కింది. ఇప్పుడీ ఫలితం ఆయన్ని సూపర్ స్టార్ రజనీకాంత్ ని మరోసారి కలిసేలా చేస్తోందని చెన్నై టాక్. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ఒకే ఒక సినిమా దళపతి. 1991లో మహాభారతంలో కర్ణుడు దుర్యోధనుడు పాత్రలను తీసుకుని ఈ క్లాసిక్ ని తీర్చిదిద్దిన తీరు భారీ వసూళ్లనే కాదు దశాబ్దాలు గడిచే కొద్దీ దాని కల్ట్ స్టేటస్ ని పెంచుకుంటూ పోతూనే ఉంది. ఇప్పటికే ఇళయరాజా బెస్ట్ ఆల్బమ్స్ దళపతిని ఒకటిగా చెప్పాల్సిందే.
ఇదంతా జరిగి 30 ఏళ్ళు దాటేసింది. పొన్నియన్ సెల్వన్ 2 తాలూకు పనులు మొత్తం పూర్తయ్యి 2023 వేసవిలో రిలీజ్ చేశాక రజనితో తో మణిరత్నం సినిమా మొదలుపెట్టబోతున్నట్టు తెలిసింది. పిఎస్ 1 & 2 లాగా ఇదేమి రాజవైభవానికి సంబంధించిన కథ కాదుట. జీవితంలో ఉన్నతం పతనం అన్నీ చూసేసిన ఒక మనిషి ఎమోషనల్ జర్నీని తనదైన శైలిలో నాయకుడు ఫార్మట్ లో తీయబోతున్నట్టు వినికిడి. ఇప్పటికే ఈ కాంబో సాధ్యం కావడం గురించి విశ్వసనీయ తమిళ మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ తో జైలర్ చేస్తున్న రజని అది పూర్తి చేశాక దీనికి సంబంధించిన క్లారిటీ ఇవ్వొచ్చు.
This post was last modified on October 13, 2022 8:52 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…