ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయి ఏడాది దాటిపోయింది. ప్రమోషన్ల కోసం కొన్ని రోజులు కేటాయించడం తప్పితే హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లకు ఇంకే పని లేదు. చరణ్ ముందే శంకర్ సినిమాను ఓకే చేసి పెద్దగా ఆలస్యం చేయకుండా గత ఏడాది చివర్లోనే ఆ ప్రాజెక్టును పట్టాలెక్కించాడు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటిదాకా తన కొత్త చిత్రాన్ని మొదలుపెట్టలేకపోయాడు.
త్రివిక్రమ్‌తో అంతకుముందు అనుకున్న సినిమా క్యాన్సిల్ అయిపోగా.. దాని స్థానంలోకి కొరటాల శివ చిత్రం వచ్చింది. కానీ ఈ సినిమా స్క్రిప్టు ఎంతకీ ఓకే కాకపోవడంతో ఇప్పటిదాకా సినిమా ప్రారంభం కాలేదు. ఇంకో రెండు మూడు నెలల తర్వాత అయినా ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుందా అన్నది సందేహంగానే ఉంది. ఇది తారక్ అభిమానులకు అస్సలు రుచించట్లేదు.
వ్యవహారం ఇలా ఉంటే.. ఇంకోవైపు యాంటీ ఫ్యాన్స్ ఈ సినిమా గురించి నెగెటివ్ వార్తలను అదే పనిగా స్ప్రెడ్ చేస్తున్నారు. అందులో ఈ సినిమా హీరోయిన్ టాపిక్ కూడా ఒకటి. ఈ చిత్రం కోసం కియారా అద్వానీ మొదలుకుని ఎంతోమంది హీరోయిన్లను ట్రై చేశారని.. కానీ ఏ ఒక్కరూ ఈ సినిమాను ఓకే చేయలేదని.. ఎవరికీ ఈ సినిమా పట్ల ఆసక్తి లేదని.. అందుకే రిజెక్ట్ చేస్తున్నారని వార్తలు వండి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. తాజాగా కీర్తి సురేష్ సైతం ఈ చిత్రాన్ని తిరస్కరించినట్లుగా ఓ వార్త హల్ చల్ చేస్తోంది.
కానీ అసలు విషయం ఏంటంటే.. ఇంకా స్క్రిప్టే ఓకే అవ్వలేదు. అలాంటపుడు నటీనటుల ఎంపిక వరకు ఎందుకు వెళ్తారు? హీరోయిన్లను సంప్రదించి ఎందుకు నో చెప్పించుకుంటారు? అయినా సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియనపుడు ఏ హీరోయిన్ అయినా ఎందుకు డేట్లు ఇస్తుంది? ఇంత చిన్న లాజిక్ తెలియకుండా తారక్ హీరోయిన్ విషయంలో ఈ రచ్చ ఏంటన్నది అర్థం కాని విషయం. అయినా ఆర్ఆర్ఆర్ సినిమాతో అంత పేరు సంపాదించిన తారక్‌కు హీరోయిన్ దొరకని సమస్య ఎదురవుతుందా?
This post was last modified on October 13, 2022 8:48 am
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…