దర్శకుడు అనిల్ రావిపూడి ఎఫ్3 సినిమా అనుకున్నంత ఆడలేదు కాని, తదుపరి నందమూరి బాలకృష్ణతో తీయబోయే సినిమాపై మాత్రం చాలా కాన్ఫిడెంటుగా ఉన్నాడు. కాకపోతే ఎఫ్ 3 ప్రమోషన్స్ లో మాత్రం.. ఒక ప్రక్కన వెంకీ, వరుణ్ తేజ్, మెహ్రీన్, సోనాల్ ఉన్నా కూడా.. మనోడే ఫుల్లుగా హైలైట్ అయ్యాడు. దానికి కారణం చిన్నప్పటినుండి స్టేజీ మీద డ్యాన్సులు వేయడం, డ్రామాలు వేయడం వంటి పిచ్చి ఉండటమే. అయితే ఇప్పుడు ఆ పిచ్చిని మరో లెవెల్ కు తీసుకెళ్ళాడు ఈ టాలెంటెడ్ డైరక్టర్.
లైఫ్ అంటే ఇట్టా ఉండాలా అంటూ అనిల్ రావిపూడి రకరకాల ప్రమోషన్ స్టేజీల మీద వేసిన డ్యాన్స్ స్టెప్ వేసిన సంగతి తెలిసిందే. పైగా అప్పటికే ఈయన హ్యూమరస్ మాటలకు కూడా చాలా పాపులార్టీ వచ్చేసింది. దానితో ఇప్పుడు ఈటివిలో కొత్తగా ప్రారంభం అవుతున్న ఒక రియాల్టీ షో కోసం ఏకంగా అనిల్ ను జడ్జ్ గా దించేశారు. మిష్టర్ అండ్ మిస్సెస్ అంటూ ఈటివిలో వస్తున్న ఒక రియాల్టీ గేమ్ షో కు ఇప్పుడు మాజీ హీరోయిన్ స్నేహ, బిగ్బాస్ విన్నర్ కమ్ కనుమరుగైన హీరో శివబాలాజీతో కలసి ఒక జడ్జ్ గా రంగంలోకి దిగిపోయాడు. ప్రోమోలో అయితే మనోడి టైమింగ్ అదిరిపోయిందనే చెప్పాలి. యాంకర్ శ్రీముఖితో కలసి పంచులూ.. అలాగే ఇతర కంటెస్ట్ంట్లతో మనోడి టైమింగ్ డైలాగులూ అదిరిపోయాయ్.
నిజానికి తమిళంలో చాలామంది దర్శకులు ఇలా ఒకసారి మేకప్ వేసుకోగానే హీరోలుగా మారిపోయారు కూడా. కొంతమంది క్యారక్టర్ ఆర్టిస్టులుగా నిలదొక్కుకున్నారు. చూస్తుంటే అనిల్ కూడా నిధానంగా దర్శకత్వం కంటే యాక్టింగ్ మీద ఎక్కుగా ఫోకస్ పెట్టేస్తూ.. స్లిప్పయిపోతున్నాడా అంటూ సందేహాం వచ్చేస్తోంది. కాకపోతే మన తెలుగులో మాత్రం చాలామంది పూర్తిగా డైరక్షన్ మానేశాక మాంచి యాక్టర్లుగా స్థిరపడ్డారు. మరి అనిల్ డైరక్షన్ చేసుకుంటూ మరో ప్రక్కన రియాల్టీ షోలు అండ్ యాక్టింగ్ అంటూ తన హవా కొనసాగిస్తాడేమో చూడాలి.
This post was last modified on October 12, 2022 6:44 pm
వైసీపీలో నిన్న మొన్నటి వరకు పార్టీ ముఖ్య నాయకుడు, మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్రంగా అనేక విమర్శలు వచ్చాయి.…
భోగి పండుగ రోజు ఉదయాన్నే మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తన ప్రత్యేక ప్రతిభను బయటపెట్టారు. కూటమి ప్రభుత్వాన్ని…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి ప్రశంసలు లభించాయి. గతంలోనూ పలు…
పండుగ అనగానే ఎవరైనా కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఏడాదంతా ఎంత బిజీగా ఉన్నా పండగ పూట.. కొంత సమయాన్ని ఫ్యామిలీకి…
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…