సరిగ్గా ఇంకో తొంభై రోజుల్లో విడుదల కాబోతున్న ఆది పురుష్ మీద మెల్లగా కోర్టు వివాదాలు ముసురుకుంటున్నాయి. నిన్నా మొన్నటిదాకా కేవలం నోటి మాటగా అభ్యంతరాలు వ్యక్తమైతే తాజాగా వ్యవహారం లీగల్ కోటు వేసుకుంది.ఢిల్లీకి చెందిన రాజ్ గౌరవ్ అనే న్యాయవాది ఈ సినిమాను ఆపేయమని ఆదేశించాల్సిందిగా కేసు దాఖలు చేశాడు. ఇందులో ఉన్న అభ్యంతర విషయాల మీద ముఖ్యంగా రావణాసురుడి పాత్ర ఆహార్యాన్ని తప్పుగా చూపించారని అభియోగంలో పేర్కొన్నారు. రాముడిని సైతం ప్రశాంత వదనానికి భిన్నంగా వ్యతిరేక భావం కలిగేలా ఉందని టీజర్ ని ఉదహరిస్తూ ఆరోపణలు చేశారు.
ప్రస్తుతానికి ఆ లాయర్ తరఫున ప్రభాస్ సైఫ్ అలీ ఖాన్ తదితరులతో పాటు దర్శకుడు ఓం రౌత్ నిర్మాణ సంస్థ టి సిరీస్ లకు నోటీసులు వెళ్లాయని తెలిసింది. అయితే ఇవి కోర్టు నుంచి నేరుగా కాకుండా న్యాయవాది నుంచి వివరణ కోరుతూ వచ్చినట్టు యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. దీని గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన పని లేదని, కేవలం నిమిషం వీడియో చూసి ఇలాంటి నిర్ధారణకు రావడం కరెక్ట్ కాదని, ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న నేపథ్యంలో వాటిని అడ్డుకునేలా వ్యవహరించడం ఎంత వరకు సబబని, ఈ కోణంలోనే కౌంటర్లు దాఖలు చేయబోతున్నట్టు సమాచారం.
మొత్తానికి ఆది పురుష్ ప్రమోషన్లు పాజిటివ్ గా మొదలుకాకపోయినా దీని గురించి జనం మాట్లాడుకునేలా చేయడంలో చిత్ర బృందం సక్సెస్ అయ్యింది. సోషల్ మీడియాలో ట్రోలింగ్, ట్వీట్లు, కామెంట్లు గట్రా పక్కనపెడితే వాటివల్ల కలుగుతున్న డ్యామేజ్ కన్నా వస్తున్న పబ్లిసిటీనే ఎక్కువ. అసలు కోర్టు ప్రమేయం వల్ల ఆగిపోయిన సినిమా కానీ ల్యాబ్ లో మగ్గుతున్న మూవీ కానీ గత కొన్నేళ్లలో ఏదీ లేదు. అందులోనూ కేంద్ర ప్రభుత్వంతో సానుకూలంగా ఉన్న టి సిరీస్ సంస్థకు ఇలాంటి చిక్కులు ఇబ్బంది పెట్టకపోవచ్చని ముంబై మీడియాలో వినిపిస్తోంది. జరిగేదంతా మంచికే అనేది ఆది పురుష్ కు సైతం అనుభమవుతోంది.
This post was last modified on October 11, 2022 2:34 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…