ఈ మధ్యన చాలామంది యంగ్ హీరోయిన్లు ఒక్క హిట్టు కొడితే చాలా ఎగిరెగిరి పడుతున్నారు. సినిమాను సరిగ్గా ప్రమోట్ చేయడానికి రాకపోవడమే కాకుండా, ఏకంగా యారోగెన్స్ తో చంపేస్తున్నారు. కాని కొంతమంది హీరోయిన్లు మాత్రం.. స్టార్డమ్ అంతా చూసేశాక, వయసైపోయాక కూడా తమ ప్రవర్తనతో చూపరులను కట్టిపాడేస్తుంటారు. ఈ మధ్యనే సెక్సీ ఫోటోషూట్లతో చెలరేగిపోతున్న శ్రీయ ఇప్పుడు అదే పని చేసింది.
మొన్న ఆదివారం మధ్యహ్నం హైదారబాద్ లో ఒక మల్టీప్లెక్స్ లో త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన నువ్వే నువ్వే సినిమా రిలీజై 20 సంవత్సరాలు కావొస్తున్న సందర్భంగా ఒక స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. ఆ తరువాత సోమవారం ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టేశారు. ఈ కార్యక్రమానికి స్రవంతి రవికిషోర్, త్రివిక్రమ్, ప్రకాష్ రాజ్, తరుణ్ లతో పాటు శ్రీయ సరన్ కూడా విచ్చేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీయ.. తన యునిట్ అందరినీ తెగ పొగిడేసింది. రవికిషోర్ స్వీట్ అంటూ.. త్రివిక్రమ్ సార్ చాలా సపోర్ట్ చేశారంటూ.. అలాగే తరుణ్ అయితే చాలా మంచోడంటూ.. ప్రకాష్ రాజ్ చూడ్డానికి చిన్నోడిలా ఉంటాడు కాని, తనకు ఫాదర్ తరహా మనిషంటూ ఆకాశానికి ఎత్తేసింది. తరుణ్ కు ఏకంగా స్టేజీ మీద ఒక కిస్ కూడా పెట్టిందిలే.
అక్కుడన్నవారిలో తరుణ్ తో సహా అందరూ ఏజ్ పెరిగినోళ్లలా కనిపిస్తుంటే.. శ్రీయ మాత్రం 40 ఏళ్ళొచ్చినా కూడా ఇంకా చాలా హాటుగా, క్రేజీ కుర్రదానిలే ఉండటమే కాకుండా.. ఇలా తన మాటలతో కూడా ఆకట్టుకుంది. ఈ సీన్ చూసినోళ్ళు ఎవ్వరైనా సరే, అక్కడున్న త్రివిక్రమ్ కాని లేదంటే ప్రొడ్యూసర్ రవికిషోర్ కాని ఆమెకు మరిన్ని ఛాన్సులు ఇవ్వొచ్చుకదా అనకుండా ఉండలేరు మరి. నిజానికి శ్రీయకు ఇప్పటివరకు చాలా అవకాశాలు వస్తూనే ఉన్నాయ్ కాని, ఎందుకో సడన్ గా ఆమె గ్లామరస్ రోల్స్ కూడా చేయాలని కోరుకుంటోంది. చూద్దాం ఏమవుతుందో మరి!
This post was last modified on October 11, 2022 2:16 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…