ఇటీవలే బెంగళూరులో జరిగిన ఫిలింఫేర్ సౌత్ అవార్డుల్లో అఖండకు చోటు దక్కకపోవడం పట్ల నందమూరి అభిమానుల నుంచే కాదు సగటు మూవీ లవర్స్ నుంచి సైతం ఆశ్చర్యం వ్యక్తమయ్యింది. మొత్తం పుష్ప హవా నడవటం మీద ఇప్పటికే సోషల్ మీడియాలో పలు కామెంట్లు వచ్చి పడుతున్నాయి. ఈ రెండు గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైనవే. వరల్డ్ వైడ్ లెక్కల్లో రెవిన్యూ పరంగా వ్యత్యాసం ఉండొచ్చు కానీ తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే పుష్ప కంటే అఖండనే బయ్యర్లకు ఎక్కువ లాభాలు ఇచ్చిన మాట వాస్తవం. బన్నీ మూవీ కొన్ని నష్టాలు తెచ్చిందని దర్శకుడు తేజ ఇటీవలే చెప్పడం ఇంకా హాట్ టాపిక్ గానే ఉంది.
ఫిలింఫేర్ అనేది ఏదో ప్రమాణాలు పెట్టుకుని నేషనల్ అవార్డులా ఇచ్చేది కాదు. అన్ని కమర్షియల్ సినిమాలనూ ఇందులో పరిగణనలోకి తీసుకుంటారు. ఆ మాటొస్తే పుష్ప ఒక అడవి సంపదను దోచుకుని డాన్ గా ఎదిగే స్మగ్లర్ కథ. కానీ అఖండ అలా కాదు. బాలయ్య పోషించిన అఘోరా పాత్ర ద్వారా హిందూ మత తత్వాన్ని గొప్పదనాన్ని చెబుతూనే కమర్షియల్ ఎలిమెంట్స్ ని జొప్పించిన ఎంటర్ టైనర్. పోలిక పరంగా చూసుకున్నా బెటర్ కంటెంట్ అఖండలోనే ఉందనేది బాలయ్య ఫ్యాన్స్ వాదన. పెర్ఫార్మన్స్ కోణంలో చూస్తే అల్లు అర్జున్ బాలకృష్ణ ఎవరినీ తక్కువ చేయలేం కానీ ఇంకా ఇతర విభాగాలు ఉన్నాయిగా.
ఈ ఫిలిం ఫేర్ నిర్వహించేది బాలీవుడ్ సంస్థలు కాబట్టి వాళ్లకు పుష్ప నార్త్ లో సాధించిన ఘనవిజయం కొలమానంగా కనిపించి ఉండొచ్చు. అఖండను ఆ టైంలో హిందీ డబ్బింగ్ చేసి థియేటర్లలో వదల్లేదు. దానివల్లే అది అక్కడి ఆడియన్స్ కి రీచ్ కాలేకపోయింది. తర్వాత హాట్ స్టార్ లో చూసిన వాళ్ళు ఇది బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ కదా అనుకున్నారు. ఇదంతా అఖండని మెచ్చుకోవడమో పొగడటమో కాదు. కమర్షియల్ సినిమాలకు పురస్కారాలు ఇచ్చేటప్పుడు ఒకదాని మీదే ఫోకస్ ఎక్కువ కావడం వల్ల వచ్చే చిక్కే ఇదంతా. రాష్ట్రప్రభుత్వాలు ఇవ్వాల్సిన నంది అవార్డులు కనుమరుగయ్యాక వీటి ప్రాధాన్యం పెరిగిపోయింది.
This post was last modified on October 11, 2022 11:33 am
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…