Movie News

సలార్ వస్తోందిగా.. ప్రాజెక్ట్ కె వర్రీ అవక్కర్లేదు

‘ఆదిపురుష్‌’ ఖచ్చితంగా డబుల్ బ్లాక్ బాస్టర్.. రాసిపెట్టికోండి.. అంటూ ఒక ప్రక్కన దర్శకుడు ఓం రౌత్.. అలాగే ఇక్కడ లోకల్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఎంత చెబుతున్నా కూడా ఎందుకో సూపర్ స్టార్ ప్రభాస్ అభిమానులు మాత్రం వాళ్ళ మాటల్ని నమ్మట్లేదు. ఒక్కసారి ఆ టీజర్ లో ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ చూశాక.. మొత్తం సినిమా ఇదే తరహాలో ఉంటే మాత్రం ట్రోలింగ్ తప్పదని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. మొన్నటివరకు ఏకంగా వచ్చే జనవరిలో బాలీవుడ్ ను ఆదుకునే ఆపద్భాందవుడు ఆదిపురుష్‌ అనే నమ్మకంతో ఉన్న అభిమానులు ఇప్పుడు మాత్రం బాగా డిజప్పాయింట్ అయిపోయారు.

ఒకవేళ హిందుత్వ ఎఫెక్ట్ తో ఆదిపురుష్‌ సినిమా హిందీలో బీభత్సంగా ఆడేసినా కూడా, సౌత్ లో మాత్రం చాలా కష్టమే అంటూ ఇప్పటికే కామెంట్లు వినిపిస్తున్నాయ్. దానితో ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ‘ప్రాజెక్ట్ కె’ మీద పడ్డారు. ఆదిపురుష్‌ తరహాలో లాస్ట్ మినిట్లో షాకివ్వకుండా ముందుగానే ఈ సినిమా కంటెంట్ గురించి, సీన్ల గురించి ఏమన్నా లీక్స్ అండ్ అప్డేట్స్ ఇస్తే.. ఆడియన్స్ మైండ్ ను సెట్ చేసే ఛాన్సుంటుందని ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. కాకపోతే వాళ్ళు ఒక విషయం మర్చిపోయారు. అసలు ప్రాజెక్ట్ కె రాకముందే మనం ప్రభాస్ ను ‘సలార్’ సినిమాలో చూడబోతున్నాం. సో, పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.

కెజిఎఫ్‌ సృష్టికర్త ప్రశాంత్ నీల్ చాలా ఛాలెజింగ్ గా రూపొందిస్తున్న సినిమా సలార్. ఆల్రెడీ ఈ సినిమా తాలూకు స్టిల్స్ అవీ చాలానే లీకయ్యాయ్. ఆన్ లొకేషన్లో తీసిన వీడియోలను చూస్తే.. ఇందులో ప్రభాస్ ఏకంగా కెజిఎఫ్‌ రాఖీ భాయ్ కంటే క్రూరంగా ఉంటాడని అనిపిస్తోంది. పైగా సలార్ సినిమా ఆదిపురుష్‌ లా పౌరాణికం కాదు, అలాగే ప్రాజెక్ట్ కె తరహాలో టైమ్ ట్రావెల్ అంటూ ఊరించే సైన్స్ ఫిక్షన్ కాదు. సలార్ ఊరమాస్ కమర్షియల్ సినిమా కాబట్టి.. ఆదిపురుష్‌ తేడా పడినా కూడా ప్రాజెక్ట్ కె ఎలా ఉంటుందో అని ఆందోళన చెందక్కర్లేదు. సలార్ ఎలాగో సిక్సర్ కొట్టేతీరుతుంది.

This post was last modified on October 10, 2022 12:44 pm

Share

Recent Posts

నాని వాళ్ళని ఎప్పటికీ వదలడు

నేచుర‌ల్ స్టార్ నాని అంటే ఒక‌ప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎక్కువ‌గా ఫ్యామిలీ ట‌చ్ ఉన్న…

3 hours ago

డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ చేసేవాడ్ని

నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…

6 hours ago

ప్యార‌డైజ్ ద‌ర్శ‌కుడు రాజమౌళి ద‌గ్గ‌ర చేరతాడ‌ట‌

ఇండియాస్ నంబ‌ర్ వన్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ విభాగంలో ప‌ని చేయాల‌ని కాబోయే డైరెక్ట‌ర్ కావాల‌నుకున్న ప్ర‌తి వ్య‌క్తికీ…

6 hours ago

ట్రైలర్ లేకపోవడం ఎంత వరకు సేఫ్

అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…

8 hours ago

ఇంద్ర చూపిన దారిలో మిగిలినవీ రావాలి

తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…

9 hours ago

అసలు భయాన్ని థియేటర్‌లో చూపిస్తారేమో

ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…

10 hours ago