అసలు ‘పొన్నియన్ సెల్వన్ 1’ సినిమా తెలుగులో ఆడట్లేదని తెలుగు సినిమాలను, హీరోలను తమిళులు ఏ రేంజులో ట్రోల్ చేశారో వేరే చెప్పక్కర్లేదు. అయితే తెలుగులో దాదాపు ₹8 కోట్లు షేర్ ఈ సినిమా వసూలు చేసిందంటే.. తెలుగు ప్రేక్షకులు ఎంతటి గొప్ప దాతలో వాళ్ళకి అర్దమేకాదులే. ఇకపోతే PS1 గోల్డెన్ రన్ ఇంకా పూర్తవ్వకుండానే.. మణిరత్నం టీమ్ ఈ సినిమా సీక్వెల్ గురించి నానా హంగామా చేస్తున్నారు. ఏకంగా బాహుబలి అండ్ KGFను కామెంట్ చేసే రేంజులో వారి ప్రమోషన్లు ఉండటం ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.
బాహుబలి మరియు KGF వంటి సినిమాలు.. పార్ట్ 1 రిలీజై హిట్టయ్యాక రెండో పార్టు షూట్ చేశారు. కాని పొన్నియన్ సెల్వన్ మాత్రం ఆల్రెడీ రెండు పార్టులూ షూట్ చేసేసి ఒకటి రిలీజ్ చేశారు. దానితో రెండో పార్ట్ కు వచ్చే హైప్ మరియు లాభాలు ఒక రేంజులో ఉంటాయంటూ ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్స్ తో ట్వీట్లు చేయిస్తోంది పొన్నియన్ సెల్వన్ టీమ్. వీళ్ల కామెడీ కాకపోతే, అసలు బాహుబలి సినిమాను చూసి రెండు పార్టులుగా సినిమాను రిలీజ్ చేద్దాం అని ఫిక్సయిన మణిరత్నం సార్, బాహుబలిని ఎలా షూట్ చేశారో తెలుసుకోలేదంటారా?
నిజానికి రాజమౌళి బాహుబలి సినిమాను ఒకటే సినిమాగా తీశారు. కాని షూటింగ్ అయ్యాక చూసుకుంటే సినిమా లెంగ్త్ చాలా ఉంది కాబట్టి, రెండు భాగాలుగా నెరేట్ చేద్దాం అని ఫిక్సయ్యారు. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ వంటి సీక్వెల్ సినిమాల తరహాలో బాహుబలిని కూడా రెండు ముక్కలు చేశారు. కాకపోతే పార్ట్ 1 రిలీజయ్యాక.. అప్పటికే 70% షూటింగ్ పూర్తి చేసుకున్న బాహుబలి-2 సినిమాను యాజిటీజ్ రిలీజ్ చేస్తే బాగోదని, మళ్లీ కొన్ని మార్పులు చేశారు. ఉదాహరణకు.. ఒరిజినల్ స్ర్కిప్ట్ ఐడియాలో అసలు సెకండ్ పార్ట్ లో తమన్నా క్యారక్టర్ లేదు. కాని రాజమౌళి ఆడియన్స్ కోసం మళ్లీ తమన్నాను పిలిపించి యుద్దం సీన్లను ఆమెతో రీషూట్ చేశారు. ఆ క్రమంలో సుదీప్ తో చేద్దాం అనుకున్న సీక్వెన్స్ వంటి మిస్సయ్యాయ్ కూడా.
అలాగే కెజిఎఫ్ సినిమాను కూడా దర్శకుడు ప్రశాంత్ నీల్ ముందుగానే చాలావరకు షూట్ చేసేశాడు. రెండు పార్ట్స్ గా సినిమాను రిలీజ్ చేద్దాం అని ఫిక్సయ్యాక.. ఫస్ట్ పార్ట్ రెస్పాన్స్ చూసుకుని మనోడు కూడా రెండో భాగంలో చాలా మార్పులు చేశాడు. అంతే తప్పించి, మొదటి పార్టు హిట్టయ్యింది కాబట్టి అది చూసుకుని రెండో పార్టు షూట్ చేయడం వంటివి ఆ లెజెండ్స్ చెయ్యలేదు. ఏదేమైనా కూడా, PS2 ప్రమోషన్ కూడా ఇప్పుడు బాహుబలి, కెజిఎఫ్ మీద ఏడిస్తే మాత్రం.. ఈసారి ఆ మాత్రం కలక్షన్లు కూడా రావేమో. దానికంటే కంటెంట్ మీద ఫోకస్ చేస్తే బెటర్.
This post was last modified on October 10, 2022 12:13 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…