ఒకప్పుడు కన్నడ ఫిలిం ఇండస్ట్రీని దేశంలోని మిగతా సినీ పరిశ్రమలు తక్కువగా చూసేవి. అందుకు అక్కడి సినిమాల లో క్వాలిటీనే కారణం. ఎక్కువగా రీమేక్ సినిమాలు చేస్తూ, రొటీన్ మాస్ మసాలా సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ చాలా వెనుకబడి ఉండేది శాండిల్‌వుడ్. కానీ గత కొన్నేళ్లలో అక్కడి సినిమాల తీరు మారింది. ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టి, అనూప్ భండారి, రాజ్ బి.శెట్టి లాంటి యువ దర్శకులు కన్నడ సినిమాల స్థాయి పెంచారు. దేశం మొత్తం శాండిల్‌వుడ్ వైపు చూపేలా చేశారు.
ఈ ఏడాది కేజీఎఫ్-2, విక్రాంత్ రోణ లాంటి చిత్రాలు పాన్ ఇండియా లెవెల్లో అదరగొట్టాయి. ఇప్పుడు కన్నడ నుంచి మరో సినిమా జాతీయ స్థాయిలో సత్తా చాటుతోంది. అదే.. కాంతార. నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తూ.. స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందించాడు. రిలీజ్ రోజు నుంచి ఈ సినిమా సంచలనం రేపుతోంది.
కన్నడ నాట సెన్సేషనల్ కలెక్షన్లతో దూసుకెళ్తున్నా కాంతార.. ఇతర రాష్ట్రాల్లో కూడా సత్తా చాటుతోంది. హైదరాబాద్‌లో ఈ సినిమా హౌస్‌ఫుల్స్‌తో రన్ అవుతోంది. ఒక రోజు ముందు ప్లాన్ చేసుకుంటే తప్ప టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. దసరా పండక్కి ఇక్కడ మూడు సినిమాలు రిలీజ్ కావడం వల్ల కాంతారకు చాలా తక్కువ స్క్రీన్లు, షోలే దక్కాయి. ఐతే వాటికి విపరీతమైన డిమాండ్ నెలకొంది. శనివారం హైదరాబాద్‌లో షోలన్నీ అడ్వాన్స్ ఫుల్స్ అయ్యాయి. ఆదివారం కూడా మెజారిటీ షోలు సోల్డ్ ఔట్ అయిపోయాయి.
ఇక్కడే కాదు.. చెన్నై, ముంబయి, కోచి లాంటి పెద్ద నగరాల్లోనూ కాంతారకు మాంచి డిమాండ్ కనిపిస్తోంది. స్క్రీన్లు, షోలు పెరుగుతున్నాయి. అన్ని షోలూ ఫుల్స్‌తో నడుస్తున్నాయి. ఈ సినిమాను ఒక మాస్టర్ పీస్‌లాగా క్రిటిక్స్ అభివర్ణిస్తున్నారు. ముఖ్యంగా గత కొన్నేళ్లలో ఇండియాలో వచ్చిన బెస్ట్ క్లైమాక్స్ ఇదే అంటూ కాంతార పతాక సన్నివేశాలను కొనియాడుతున్నారు.
This post was last modified on October 8, 2022 9:54 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…