ఎప్పుడో ఓ పాతిక ముప్పై సంవత్సరాల క్రితం కేవలం దూరదర్శన్ ఛానల్ మాత్రమే అందుబాటులో ఉండేది. ప్రతి ఆదివారం ఓ తెలుగు సినిమా వచ్చేది. అది మురళీమోహన్ దైనా ఎన్టీఆర్ దైనా జనం పనులన్నీ మానుకుని గుడ్లప్పగించి చూసేవాళ్ళు. 1995 తర్వాత కేబుల్ విప్లవం ఊపందుకున్నాక ఈటీవీ, జెమినిల ప్రవేశంతో రోజుకో మూవీ కాన్సెప్ట్ తో ప్రేక్షకులకు ఎంటర్ టైన్మెంట్ ఆప్షన్లు పెరగడం ప్రారంభమయ్యింది. పెద్ద హీరోల చిత్రాలు బుల్లితెరపై చూడటం గొప్ప విషయంగా భావించే రోజుల్లో వీటి ఎంట్రీతో అది కాస్తా సులభమైన వ్యవహారంగా మారిపోయింది. దాంతో మొదలు శాటిలైట్ హక్కులు నిర్మాతలకు అదనపు డబ్బు తెచ్చే బంగారు బాతులా మారాయి.
మెల్లగా కాలం మారింది. పుట్టగొడుగుల్లా ఛానల్స్ పుట్టుకొచ్చాయి. ప్రతి భాషలో రోజుకో వంద సినిమాలు వస్తున్నాయి. మరోవైపు యుట్యూబ్ లో ఏది కావాలంటే అది క్షణాల్లో చూసుకునే వెసులుబాటు. ఓటిటిల మధ్య విపరీతమైన పోటీ. ఓ మూడు వారాల క్రితం ఊళ్ళో గోడల మీద చూసిన కొత్త పోస్టర్ లో ఉన్న బొమ్మ నేరుగా ఇంట్లోనే చూసుకోమంటూ స్ట్రీమింగ్ అలర్ట్ వస్తోంది. అది కూడా ఎలాంటి యాడ్స్ గొడవ లేకుండా ప్రశాంతంగా రివైండ్ ఫార్వార్డ్ చేసుకునే ఆప్షన్లతో. సహజంగానే టీవీలు చూసే ఆడియన్స్ శాతం క్రమంగా తగ్గుతూ వస్తోంది. సగటు మధ్యతరగతి జీవులకు ఇప్పటికీ ఇదే మెయిన్ ఆప్షన్ కానీ వాళ్ళూ మారే రోజు దగ్గరలో ఉంది.
గత రెండుమూడేళ్లుగా టీవీలో వచ్చే వరల్డ్ ప్రీమియర్ల టిఆర్పి రేటింగ్స్ బాగా పడిపోతున్నాయి. ఓటిటిలో ముప్పై నుంచి యాభై రోజుల్లోనే కొత్త సినిమాలు వస్తుంటే ఛానల్స్ లో మాత్రం మూడు నెలల గ్యాప్ తీసుకుంటున్నారు. దీనివల్ల అంత ఓపిగ్గా ఎదురు చూడలేని పబ్లిక్ హ్యాపీగా డిజిటల్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో కనీసం పదిహేనుకు పైగా రేటింగ్ రావాల్సిన సర్కారు వారి పాట, కెజిఎఫ్ లాంటి క్రేజీ మూవీస్ సైతం దాన్ని అందుకోలేకపోతున్నాయి. అంతగొప్ప ఆర్ఆర్ఆరే ఇరవైని త్రుటిలో మిస్ అయ్యింది. అల వైకుంఠపురములో తర్వాత మళ్ళీ అంత పెద్ద నెంబర్ అందుకున్న సినిమా ఏదీ లేదు. చూస్తుంటే వీటి శకానికి ముగింపు వచ్చినట్టే ఉంది.
This post was last modified on October 9, 2022 1:29 pm
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…