మృణాల్ ఠాకూర్.. గత కొద్ది రోజుల నుంచి అటు సోషల్ మీడియా, ఇటు ప్రధాన మీడియాలో మారుమ్రోగిపోతున్న పేరు ఇది. హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన ‘సీతారామం’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైన అందాల భామ మృణాల్.. తొలి సినిమాతోనే ఇక్కడ సంచలన విజయాన్ని అందుకుంది.
అలాగే ఇందులో సీతామహాలక్ష్మిగా తనదైన అందం, ఆకట్టుకునే నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. సీతగా తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఆమె కూడా ఊహించనంత భారీ రెస్పాన్స్ సీత పాత్రకు లభించింది. ఈ మూవీ అనంతరం మృణాల్ ఠాకూర్ కు సౌత్ లో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.
ఈ సంగతి పక్కన పెడితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ ఠాకూర్ తన కెరీర్ కు సంబంధించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. కెరీర్ ఆరంభ సమయంలో పడ్డ కష్టాలు, ఎదురైన సవాళ్లను ఆమె వివరించింది. ప్రస్తుతం తనకు వచ్చిన అవకాశాలతో ఎంతో సంతోషంగా ఉన్నానని, కొందరు దర్శకులు తనపై నమ్మకంతో ఆఫర్లు కల్పిస్తున్నారని ఆమె పేర్కొంది.
ఈ క్రమంలోనే వయసు, ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చాలా మంది తన వయసెంత అని అడుగుతున్నారని, తన వయసు 30 ఏళ్లు అని చెప్పగానే.. దాదాపు అందరూ పెళ్లి చేసుకోమని సూచనలు, వివాహం గురించి మీ అభిప్రాయం ఏంటి..? అంటూ ప్రశ్నలు వేస్తుంటారని, దాంతో వెంటనే వారికి బై చెప్పేస్తానని మృణాల్ చెప్పుకొచ్చింది.
అలాగే 20 ఏళ్ల వయసులో పుట్టే ప్రేమకు.. 30 ఏళ్ల వయసులో పుట్టే ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంటుందని మృణాల్ తెలిపింది. 20 ఏళ్లలో ప్రాథమిక విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోరని.. కానీ, 30 ఏళ్ల వయసులో భాగస్వామి మరియు జీవితంపై సరైన స్పష్టత వస్తుందని ఆమె పేర్కొంది.
ఇక తనకు చిన్నప్పుడు హృతిక్ రోషన్, షాహిద్ కపూర్ లపై క్రష్ ఉండేదని, వారి ఫొటోల్ని చించి బుక్స్‌లో పెట్టుకుని చూసుకునేదాన్నని చెప్పుకొచ్చిన మృణాల్.. వాళ్లతో కలిసి నటించే అవకాశం వచ్చినప్పుడు ఆనందంతో ఎగిరిగంతేశానని తెలిపింది. కాగా, మృణాల్ హృతిక్ రోషన్ తో ‘సూపర్ 30’, షాహిద్ కపూర్ తో ‘జెర్సీ’ చిత్రాలు చేసింది. ఇందులో సూపర్ 30 మంచి విజయం సాధించగా.. జెర్సీకి మిశ్రమ స్పందన దక్కింది.
This post was last modified on October 7, 2022 6:06 pm
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…