Movie News

కొంపముంచిన నాగ్ ఓవర్ కాన్ఫిడెన్స్

టాలీవుడ్లో మిగతా సీనియర్ హీరోల పరిస్థితి మెరుగ్గానే ఉంది కానీ.. అక్కినేని నాగార్జున మాత్రం రోజు రోజుకూ కిందికి పడిపోతున్నారు. చెత్త సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిన రామ్ గోపాల్ వర్మను నమ్మి ‘ఆఫీసర్’ మూవీ చేయడం ఆయన కెరీర్లో అతి పెద్ద మిస్టేక్. ఆ సినిమాతో ఆయన ఒకేసారి పాతాళానికి పడిపోయారు.

అక్కడి నుంచి పైకి లేవడానికి ఎంతగా ప్రయత్నిస్తున్నా ఫలితం దక్కట్లేదు. ‘వైల్డ్ డాగ్’ సినిమా మంచి టాక్ తెచ్చుకుని కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ‘బంగార్రాజు’ సినిమా బ్లాక్‌బస్టర్ మూవీ ‘సోగ్గాడే చిన్నినాయనా’కు సీక్వెల్ కావడం, సంక్రాంతికి రిలీజ్ కావడం వల్ల ఎలాగోలా బయటపడిపోయింది కానీ.. ‘ది ఘోస్ట్’ సినిమాకు వచ్చేసరికి నాగ్ యథాప్రకారం పతనం చవిచూస్తున్నారు. అసలే ఈ సినిమాకు ప్రి రిలీజ్ బజ్ లేదు. దీనికి తోడు బ్యాడ్ టాక్ రావడంతో వసూళ్లు దారుణంగా ఉన్నాయి.

విడుదలకు ముందు ఆశించిన స్థాయిలో బిజినెస్ ఆఫర్లు రాలేదో.. లేక సినిమా మీద ఉన్న నమ్మకంతో నిర్ణయం తీసుకున్నారో తెలియదు కానీ.. ఈ చిత్రాన్ని మెజారిటీ ఏరియాల్లో నిర్మాతలతో కలిసి నాగార్జునే సొంతంగా రిలీజ్ చేశాడు. ఎందుకీ రిస్క్ చేస్తున్నారని విడుదలకు ముందు అడిగితే సినిమా మీద తమకున్న నమ్మకమే కారణమని చెప్పాడు. సునీల్ నారంగ్ లాంటి బలమైన ఎగ్జిబిటర్ ఈ సినిమాకు నిర్మాత కావడంతో నైజాం ఏరియాలో మంచి మంచి థియేటర్లు లభించాయి. థియేటర్ల సంఖ్య పరిమితమే అయినా.. మంచి థియేటర్లను ‘ది ఘోస్ట్’ దక్కించుకుంది.

ఐతే ఇప్పుడా థియేటర్లన్నీ వెలవెలబోతున్నాయి. దసరా సీజన్‌ను ఉపయోగించుకోలేక నిరుపయోగం అవుతున్నాయి. ‘ది ఘోస్ట్’ సినిమాను సాధ్యమైనంత త్వరగా గాడ్‌ఫాదర్ లేదా స్వాతిముత్యం సినిమాలతో రీప్లేస్ చేయడం మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాను సొంతంగా రిలీజ్ చేయాలన్న నిర్ణయం బెడిసికొట్టి నిర్మాతలకు మరింత నష్టం తప్పేలా లేదు. డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేసి ఉంటే ఓ మోస్తరుగా ఆదాయం వచ్చి నిర్మాతలు బయటపడేవారు. సినిమా మీద అతి నమ్మకంతో చేసిన ఈ ప్రయత్నం పెద్ద దెబ్బే కొట్టినట్లు కనిపిస్తోంది.

This post was last modified on October 7, 2022 5:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago