చంద్రహాస్.. యాంకర్ కమ్ యాక్టర్ ప్రభాకర్ కొడుకైన ఈ కుర్రాడు ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. హీరో అవ్వాలన్న లక్ష్యంతో అందుకోసం ప్రిపేరవుతూ.. తన వీడియోలతో యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో కొంత ఫాలోయింగ్ సంపాదించుకున్న అతను.. ఇటీవల తాను హీరోగా పరిచయం అవుతున్న సినిమా లాంచింగ్ సందర్భంగా వ్యవహరించిన తీరు చర్చనీయాంశం అయింది.
తన కొడుకు గురించి ఓ పక్క ప్రభాకర్ ఇంట్రో ఇస్తుంటే.. చంద్రహాస్ విచిత్రమైన హావభావాలు ఇచ్చాడు. అతడి యాటిట్యూడ్ గురించి సోషల్ మీడియాలో మామూలుగా ట్రోలింగ్ జరగలేదు. అతడికి యాటిట్యూడ్ స్టార్ అని బిరుదు కూడా ఇచ్చేశారు. తన కొడుకును ట్రోల్ చేస్తే ఊరుకునేది లేదని ప్రభాకర్ వార్నింగ్ ఇచ్చినా సరే.. నెటిజన్లు తగ్గలేదు. అతణ్ని ఇప్పటికీ ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఐతే ఈ ట్రోలింగ్‌ను చంద్రహాస్, అతడి సినిమా టీం పాజిటివ్‌గానే తీసుకున్నట్లుంది. నెటిజన్లు వ్యంగ్యంగా పెట్టిన ‘Attitude Star’ ట్యాగ్‌నే వాళ్లు వాడుకుంటుండడం విశేషం.
చంద్రహాస్ తొలి చిత్రానికి ‘బ్లాక్ డాగ్ ఫర్ వైట్ చిక్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా టీజర్ కూడా లాంచ్ చేశారు. అందులో చంద్రహాస్ పేరు ముందు ‘యాటిట్యూడ్ స్టార్’ అని వేయడం విశేషం. సినిమా లాంచింగ్ డేను మించి ఇందులో యాటిట్యూడ్ చూపించాడు చంద్రహాస్. “అరేయ్ బామ్మర్దీ.. మన ఎంట్రీ గురించి కంట్రీ మొత్తం మాట్లాడాలని గట్ల కొట్టినా” అంటూ ఒక డైలాగ్ పెట్టి చంద్రహాస్‌తో వీర లెవెల్లో ఫైట్ చేయించారు.
తనను ట్రోల్ చేస్తూ ఇచ్చిన బిరుదునే వాడుకోవడం చూస్తే.. ఓ సందర్భంలో ప్రకాష్ రాజ్ “నా మీద రాళ్లు వేస్తే వాటితో ఇల్లు కట్టుకుంటా” అంటూ చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. ట్రోలింగ్‌తో వచ్చిన పాపులారిటీని చంద్రహాస్ ఇలా వాడుకుంటున్నట్లున్నాడు. ఇంకో విశేషం ఏంటంటే.. ‘బ్లాక్ డాగ్ ఫర్ వైట్ చిక్’ మూవీ పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో సినిమాను రిలీజ్ చేస్తున్నారట. మరి యాటిట్యూడ్ స్టార్‌ను అన్ని భాషల వాళ్లు ఏమేర ఆదరిస్తారో చూడాలి.
This post was last modified on October 6, 2022 2:20 pm
‘అఖండ 2.. తాండవం’ బాక్సాఫీస్ దగ్గర తాండవం ఆడుతూ దూసుకెళ్తోంది. సినిమాకు మిక్స్డ్ రివ్యూలు, టాక్ వచ్చినప్పటికీ.. తొలి రోజు…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య వచ్చిన ‘అఖండ-2’కు మిక్స్డ్ టాక్ వచ్చిన సంగతి…
టాలెంట్, రూపం రెండూ ఉన్న నటుడు ఆది పినిశెట్టి. మొదట హీరోగా పరిచయమైనా సరైనోడులో విలన్ గా మెప్పించాక ఒక్కసారిగా…
ఇప్పుడు పాడటం లేదు కానీ ఇరవై సంవత్సరాల క్రితం తెలుగు సంగీతంలో పాప్ మ్యూజిక్ అనే ఒరవడి తేవడంలో గాయని…
ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కొనసాగుతోంది. దీనికి డెడ్‌లైన్‌ను మళ్లీ…
సంగీత దర్శకుడు తమన్ అఖండ 2 కోసం ఇచ్చిన సంగీతం మీద మిశ్రమ స్పందనే దక్కింది. ఆడియో శివ భక్తులకు…