బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారంతో బాలీవుడ్లో నెపోటిజం గురించి పెద్ద చర్చే నడిచింది. నడుస్తోంది. బాలీవుడ్ బడా ఫ్యామిలీలకు చెందిన వాళ్లు.. సొంత టాలెంట్‌తో కష్టపడి ఎదిగిన వాళ్లను తొక్కే ప్రయత్నం చేస్తుంటారని.. వాళ్లను చేరదీయరని.. చిన్నచూపు చూస్తారని పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు అనేక ఉదాహరణలు కూడా చూపిస్తూ వారిపై విరుచుకుపడుతున్నారు జనాలు.
కొందరు సెలబ్రెటీలు ఈ విషయంలో ధైర్యంగా తమ గళం వినిపించారు కూడా. ఐతే కేవలం నెపోటిజం గురించి మాట్లాడటం వల్ల లాభం లేదని.. పరిశ్రమలో మరెన్నో అన్యాయాలు జరుగుతుంటాయని అంటున్నాడు యువ నటుడు జీషన్ అయూబ్.
నో వన్ కిల్డ్ జెస్సికా, రాన్‌జానా, తను వెడ్స్ మను రిటర్న్స్, ఆర్టికల్ 15 లాంటి సినిమాలతో గుర్తింపు సంపాదించిన జీషన్.. సినీ పరిశ్రమలో నటీనటులు, టెక్నీషియన్లకు ముందు చెప్పేది ఒకటి, కానీ తర్వాత జరిగేది ఒకటి అని.. దీని గురించి ఎవరూ మాట్లాడరని అన్నాడు. ముందు మన పాత్ర గురించి ఆహా ఓహో అని చెబుతారని.. కానీ మధ్యలో స్క్రిప్టు మారిపోతుందని.. కానీ దాని గురించి ఏ సమాచారం ఇవ్వకుండా పాత్రను కుదించేస్తారని.. దాని గురించి తర్వాత మాట్లాడనే మాట్లాడరని అతనన్నాడు.
అలాగే పోస్టర్లో మన బొమ్మ కూడా ఉంటుందని ముందు చెబుతారని, ప్రమోషన్లలో ప్రాధాన్యం కల్పిస్తారని అంటారని.. తీరా చూస్తే ఎక్కడా మన పేరు, బొమ్మ ఉండదని.. అలాగే లీడ్ క్యారెక్టర్లలో ఒకటని చెప్పి సినిమాకు ఒప్పిస్తారని.. కానీ తర్వాత సైడ్ క్యారెక్టర్‌ని చేసి పడేస్తారని.. ఈ అబద్ధాలు, అన్యాయాల గురించి ఎవరూ మాట్లాడరని.. సినీ పరిశ్రమలో నెపోటిజంకు మించి, లోతైన సమస్య ఇదని.. దీని గురించి చర్చ జరగాలని అతను అభిప్రాయపడ్డాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates