టాలీవుడ్లో దసరా సందడి మొదలైపోయింది. ఈ పండక్కి ఒకే రోజు మూడు సినిమాలు రిలీజవుతున్నాయి. తర్వాతి వారం కూడా ఈ సినిమాల సందడే కొనసాగేలా ఉంది. చెప్పుకోదగ్గ సినిమాలేమీ రిలీజ్ కావట్లేదు. మళ్లీ దీపావళి ముంగిట సందడి నెలకొనబోతోంది. అక్టోబరు 21కి వరుసగా ఒక్కో సినిమా బెర్తు బుక్ చేసుకుంటోంది.
ఇప్పటికే తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ‘ప్రిన్స్’ మూవీ దీపావళికి ఫిక్సయింది. ఈ మధ్యే విశ్వక్సేన్ సినిమా ‘ఓరి దేవుడా’ను కూడా దీపావళి రేసులో నిలబెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మంచు విష్ణు సినిమా జిన్నాను సైతం దీపావళి పోటీలోకి తీసుకొచ్చారు. మూడు పేరున్న సినిమాలు రిలీజవుతుండడంతో దీపావళికి బెర్తులు లాక్ అయిపోయినట్లే భావించారు. ఇంతకుమించి సినిమాలు వస్తే థియేటర్లు సర్దుబాటు చేయడం కష్టమే అవుతుందని భావించారు.
దీపావళి పోటీ అంతటితో ఆగడం లేదు. తాజాగా నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్-మాళవిక నాయర్ జంటగా తెరకెక్కిన వైజయంతీ మూవీస్ వారి సినిమా అన్నీ మంచి శకునములే కూడా దీపావళికే విడుదల కాబోతోంది. ఈమేరకు అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు. మరోవైపు దర్శకుడు తేజ ఏమో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దగ్గుబాటి అభిరామ్ హీరోగా తాను తెరకెక్కించిన అహింస సినిమాను సైతం దీపావళికి విడుదల చేయబోతున్నట్లు ప్రకటించాడు.
ఇవి చాలవన్నట్లు మరో తమిళ డబ్బింగ్ సినిమా కూడా దీపావళికే విడుదల కాబోతోంది. కార్తి కొత్త చిత్రం సర్దార్‌ను ఈ పండక్కే రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అది తెలుగులో కూడా ఒకేసారి విడుదల కావాల్సి ఉంది. మరి మూడు సినిమాలకే థియేటర్ల సర్దుబాటు కష్టం అంటే.. ఏకంగా అరడజను సినిమాలు దీపావళి పోటీకి సై అంటుండడంతో స్క్రీన్లు, షోలు సర్దుబాటు ఎలా అన్నది అర్థం కావడం లేదు. ఇందులో కనీసం రెండయినా రేసు నుంచి తప్పుకోక తప్పదేమో.
This post was last modified on October 5, 2022 10:18 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…