మెగాస్టార్ చిరంజీవి యథాలాపంగా చేసిన ఒక కామెంట్ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ అభిమానులను హర్ట్ చేసింది. మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషించిన మలయాళ బ్లాక్‌బస్టర్ లూసిఫర్‌ను చిరు హీరోగా గాడ్‌ఫాదర్ పేరుతో తెలుగులో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బుధవారం దసరా కానుకగా విడుదలవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రెస్ మీట్లో పాల్గొంది.
ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ.. లూసిఫర్ సినిమాను రీమేక్ చేస్తే బాగుంటుందని చరణ్ తనకు చెప్పాక రెండోసారి ఆ సినిమా చూశానని.. అప్పుడు ఆ సినిమా తనకు అంత బాగా అనిపించలేదని.. ఏదో అసంతృప్తిగా అనిపించిందని.. అప్పుడు సీనియర్ రైటర్ సత్యానంద్‌తో వర్క్ చేయించామని, ఆ తర్వాత దర్శకుడు మోమన్ రాజా కూడా ఈ ప్రాజెక్టులోకి వచ్చాడని, అతను చేసిన మార్పులు చేర్పులతో సినిమా సంతృప్తికరంగా మారిందని చిరు వ్యాఖ్యానించాడు.
లూసిఫర్ సినిమా అంత బాగా లేదని, తెలుగులో దాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దామని చిరు చేసిన వ్యాఖ్య మలయాళ ప్రేక్షకులకు, ముఖ్యంగా మోహన్ లాల్ అభిమానులకు రుచించలేదు. మరోవైపు గాడ్‌ఫాదర్‌కు మాటలు అందించిన లక్ష్మీభూపాల సైతం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తెలుగులో చిరు చేసిన గాడ్‌ఫాదర్ పాత్రను మోహన్ లాల్ కూడా చేయలేదని వ్యాఖ్యానించడం కూడా వారిని హర్ట్ చేసినట్లే ఉంది. ఈ నేపథ్యంలో వాళ్లు చిరును, గాడ్‌ఫాదర్ టీంను ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో.
ఇంతకుముందు గాడ్‌ఫాదర్ ట్రైలర్ రిలీజైనపుడు మోహన్ లాల్‌తో పోల్చి చిరును వాళ్లు కొంతమేర కించపరిచే ప్రయత్నం చేశారు. కొన్ని షాట్లను పోల్చి చిరు లాల్ ముందు తేలిపోయాడని ట్రోల్ చేశారు. ఇప్పుడేమో చిరు చేసిన చిన్న కామెంట్‌ను పట్టుకుని ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు. సినిమా రిలీజయ్యాక ఈ పోలికలు, ట్రోలింగ్‌లు ఏ స్థాయికి వెళ్తాయో చూడాలి.
This post was last modified on October 5, 2022 10:09 am
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…