ఒకప్పుడు సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ అందరూ ధియేటర్లలో పేపర్లు ఎగరేయడానికి, పదిమందికీ పాజిటివ్ టాక్ చెప్పడానికీ ప్రిపేర్ అయ్యేవారు. ఇప్పుడు మాత్రం ఒక సినిమా వస్తుందంటే.. ఆ సినిమాను ట్విట్టర్లో, ఇన్టస్టాగ్రామ్ లో ఎవరు ఎలా ఏకేస్తున్నారో చూసుకుని, కౌంటర్లకు రివర్స్ కౌంటర్ ఇవ్వడం కోసం ప్రిపేర్ అవ్వాల్సివస్తోంది. అంటే ట్రోలింగ్ అంతా ఫేస్ చెయ్యడానికి సన్నధ్దం కావాలన్నమాట. ఇకపోతే ఈ దసరా సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ రిలీజ్ అవుతోంది కాబట్టి.. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ది ఇదే పరిస్థితి. ఎందుకో తెలుసా?
ఈ మధ్యకాలంలో మెగాస్టార్ కొన్ని సందర్భాల్లో చాలామందికి చురకలు అంటించారు. దర్శకులు స్ర్కిప్ట్ ఎలా రాస్తున్నారో, డైలాగులు ఎప్పుడు రాస్తున్నారో, ప్రొడ్యూసర్ల డబ్బులకు హీరోలు విలువ ఇవ్వట్లేదని.. చాలానే అన్నారు. ఇవన్నీ కాకుండా, ఆచార్య సినిమా విషయంలో కొరటాల శివకు పెద్ద ఎర్తింగ్ పెట్టేశారు. అందువలన చాలామంది యాంటీ ఫ్యాన్స్ ఇప్పుడు ఆయన గాడ్ ఫాదర్ తో ఏం చేస్తారో చూద్దాం అన్నట్లుగా వెయిట్ చేస్తున్నారు. ఇవన్నీ ఎప్పుడూ ఉండేవేలే అనుకుంటే, ఇప్పుడు కొత్తగా పొన్నియన్ సెల్వన్ తెలుగులో ఫ్లాప్ కావడంతో.. ఒక సెక్షన్ తమిళ ఫ్యాన్స్ అందరూ తెలుగు సినిమాల మీద మాంచి కోపంగా ఉన్నారు. పైగా గాడ్ ఫాదర్ ఒక మలయాళం సినిమా కాబట్టి, మాట్లాడితే ప్రతీ ఫ్రేమునూ లూసిఫర్ తో కంపేర్ చేసి మరి ట్రోల్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సినిమాకు హిట్ టాక్ వచ్చినా కూడా నెట్టింట్లో గాడ్ ఫాదర్ కు ట్రోలింగ్ తప్పేలా కనిపించట్లేదు.
ఇప్పుడున్న సిట్యుయేషన్లో ఖచ్చితంగా మొదటి ఆటతోనే గాడ్ ఫాదర్ కు బీభత్సమైన పాజిటివ్ టాక్ రావాలి. ఒకవేళ రివ్యూ రేటింగులూ యావరేజ్ గా వచ్చినా కూడా మాస్ జనం మాత్రం సినిమాకు ఒక రేంజులో కనక్ట్ అయిపోవాలి. అప్పుడే మెగా ఫ్యాన్స్ కూడా చాలా కాన్ఫిడెంటుగా ట్రోలర్లను రివర్సులో ఆడుకునే ఛాన్సుంటుంది. లేకపోతే మాత్రం శివరాత్రే. మరి మెగా ఫ్యాన్స్ మానసికంగా రెడీయేనా?
This post was last modified on October 4, 2022 7:45 pm
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…