ఆదివారం సాయంత్రం నుంచి భారత సినీ ప్రేక్షకుల చర్చలన్నీ ‘ఆదిపురుష్’ చుట్టూనే తిరుగుతున్నాయి. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా టీజర్.. మెజారిటీ ప్రేక్షకులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. సినిమా గురించి ఏదో ఊహించుకుంటే టీజర్లో ఇంకేదో కనిపించింది. టీజర్లో ఇదొక యానిమేషన్ మూవీలాగా కనిపించడమే చాలామందికి రుచించలేదు. ఇక ఇందులో విజువల్ ఎఫెక్ట్స్, రావణుడి పాత్ర పోషించిన సైఫ్ అలీఖాన్ అప్పీయిరెన్స్ మీద తీవ్ర విమర్శలే వచ్చాయి.
ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో సోషల్ మీడియాలో ట్రోల్ అయిన మూవీ ఇంకోటి లేదు అనే స్థాయిలో ‘ఆదిపరుష్’ నెగెటివిటీని ఎదుర్కొంటోంది ఇప్పటికీ ఈ ట్రోల్ కొనసాగుతూనే ఉంది. ఇదే సమయంలో ప్రభాస్ లైవ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది ‘ఆదిపురుష్’ టీజర్ లాంచ్ తర్వాత అయోధ్యలో ప్రభాస్ అండ్ టీం బస చేసిన ఒక హోటల్లో తీసిన వీడియో.
ఆ వీడియోలో ప్రభాస్ చాలా సీరియస్‌గా కనిపిస్తున్నాడు. ఓం రౌత్ వైపు వేలు చూపిస్తూ.. ‘‘Om. Are you coming to my room. Come’’ అని ప్రభాస్ అనడం కనిపించింది. బయట చాలా సరదాగా కనిపించే ప్రభాస్.. ఈ వీడియోలో చాలా కోపంగ ఉన్నట్లు కనిపిస్తున్నాడు. అతను క్యాజువల్‌గానే ఓం రౌత్‌ను తన రూంకి రమ్మని పిలిచి ఉండొచ్చు. కానీ నెటిజన్లు మాత్రం దీనికి వేరే భాష్యం చెబుతున్నారు.
‘ఆదిపురుష్’ టీజర్, దానికి వచ్చిన రెస్సాన్స్ చూసి ప్రభాస్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడని.. ఈ క్రమంలోనే ఓం రౌత్‌ను రఫ్ఫాడించడానికి తన రూంకి పిలిచాడని అంటున్నారు. ‘నువ్వు నాకు నచ్చావ్’లో కిళ్ళీ గురించి మాట్లాడాలి అంటూ సునీల్‌ను వెంకీ పట్టుకునే వీడియో, అలాగే ‘కిక్’లో ఆలీని లోపలికి తీసుకెళ్లి రవితేజ బాదే వీడియో.. ఇంకా ‘బృందావనం’లో బ్రహ్మానందానికి ఎన్టీఆర్ కోటింగ్ ఇచ్చే వీడియో.. ఇలా రకరకాల వీడియోలు దానికి జోడించి ఓం రౌత్‌ను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
This post was last modified on October 4, 2022 4:41 pm
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…