రామ్ గోపాల్ వర్మ పబ్లిసిటీ గిమ్మిక్కుల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నేనేం చేసినా పబ్లిసిటీ కోసమే చేస్తా అని చెప్పి మరీ.. ఏదో రకంగా తన సినిమాకు పబ్లిసిటీ తెచ్చుకుంటాడు. తాజాగా వర్మ ‘థ్రిల్లర్’ పేరుతో ఓ కొత్త సినిమాను అనౌన్స్ చేసి, ఆ సినిమాతో అప్సరా రాణి అనే కొత్తమ్మాయిని సినీ పరిశ్రమకు పరిచయం చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ అమ్మాయిది ఒరిస్సా అని.. అక్కడ ఇలాంటి అందగత్తెలు ఉంటారని తనకు తెలియదని పేర్కొంటూ ఆ అమ్మాయి హాట్ ఫొటోలతో కుర్రాళ్లలో కిక్కెక్కిస్తున్నాడు వర్మ. ఐతే ఈ అమ్మాయి పరిశ్రమకు కొత్త అన్నట్లు, తనే ఆమెను వెతికి పట్టుకున్నట్లు వర్మ హడావుడి చేస్తుండగా.. ఇదంతా అసలు నిజమే కాదన్న విషయాన్ని నెటిజన్లు పసిగట్టేశారు.
వర్మ పరిచయం చేసిన అమ్మాయి కొత్త హీరోయినూ కాదు.. అసలామె పేరు అప్సరా రాణి కూడా కాదు అని తేల్చేశారు నెటిజన్లు. ఈ అమ్మాయి అసలు పేరు అంకిత మహారాణా. ఆమె ఇప్పటికే వివిధ భాషల్లో కొన్ని సినిమాల్లో నటించింది. తెలుగులో కూడా ఒకటికి రెండు సినిమాలు చేసింది. ఆ సినిమాల పేర్లు.. 4 లెటర్స్, ఉల్లాలా ఉల్లాలా. ఆ పేర్లతో సినిమాలు వచ్చిన సంగతి కూడా జనాలకు తెలియదు.
ఐతే ఎలా వర్మ కళ్లలో పడిందో కానీ.. హీరోయిన్ల అందాల్ని ఎలా ఎలివేట్ చేయాలో బాగా తెలిసిన వర్మ.. అంకిత పేరును అప్సరా రాణిగా మార్చి, ఆమెతో హాట్ హాట్ ఫొటో షూట్లు చేసి.. తనను ఓ కొత్తమ్మాయిలా పరిచయం చేశాడు. వర్మకు ఇలా ఏ కొత్త హీరోయిన్ దొరికినా.. ఇంతందాన్ని ఎప్పుడూ చూడలేదు అన్న ఎగ్జైట్మెంట్ చూపిస్తుంటాడు. తన ఫాలోవర్లను ఇలాగే ఆకర్షిస్తాడు. మొన్నామధ్య ‘నేక్డ్’ అనే సినిమాతో పరిచయం అయిన స్వీటీ అనే లోకల్ అమ్మాయి విషయంలోనూ వర్మ ఇదే ఎగ్జైట్మెంట్ చూపించాడు.
This post was last modified on July 8, 2020 3:49 pm
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…