బాలీవుడ్లో ఎప్పుడు ఏ సినిమా ఎలా ఆడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కొవిడ్ తర్వాత పరిస్థితులు అంత చిత్రంగా మారిపోయాయి. ఒకప్పుడు అలవోకగా వీకెండ్లో వంద కోట్ల వసూళ్లు రాబట్టిన హీరోలు.. ఇప్పుడు అందులో సగం కలెక్ట్ చేయడానికి కూడా కష్టపడిపోతున్నారు. ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్‌గా కొన్నేళ్ల ముందు వరకు నీరాజనాలు అందుకున్న ఆమిర్ ఖాన్.. ఇటీవల ‘లాల్ సింగ్ చడ్డా’తో ఎంత దారుణమైన అనుభవాన్ని ఎదుర్కొన్నాడో తెలిసిందే. దానికి ముందు, తర్వాత కూడా కొన్ని పెద్ద సినిమాలకు ఇలాంటి అనుభవమే ఎదురైంది.
ఐతే ఇటీవల ‘బ్రహ్మాస్త్ర’ సినిమాకు భారీ ఓపెనింగ్స్ రావడం.. ఆ సినిమా కొన్ని వారాల పాటు సత్తా చాటడంతో పరిస్థితి మెరుగుపడిందని అనుకున్నారంతా. కానీ ఇప్పుడు ఇంకో పెద్ద సినిమాకు బాక్సాఫీస్ దగ్గర చేదు అనుభవం తప్పలేదు. ఆ చిత్రమే.. విక్రమ్ వేద.
హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించిన ‘విక్రమ్ వేద’.. ఇదే పేరుతో తమిళంలో విడుదలై బ్లాక్‌బస్టర్ అయిన సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ డైరెక్టర్లు పుష్కర్, గాయత్రిలే హిందీలోనూ రీమేక్ చేశారు. ఈ సినిమాకు హిందీలోనూ మంచి టాక్ వచ్చింది. పెద్ద స్టార్ కాస్ట్, పాజిటివ్ టాక్.. ఒక సినిమా మంచి వసూళ్లు రాబట్టడానికి ఇంతకంటే ఏం కావాలి? కానీ తొలి రోజే రూ.10 కోట్ల వసూళ్లతో తీవ్రంగా నిరాశ పరిచిన ‘విక్రమ్ వేద’ తర్వాతి రెండు రోజుల్లోనూ పెద్దగా పుంజుకోలేకపోయింది.
వీకెండ్ అయ్యేసరికి మొత్తం వసూళ్లు రూ.36 కోట్లకు అటు ఇటుగా ఉన్నాయి. ఇక సోమవారం అయితే వసూళ్లు ఒక్కసారిగా డ్రాప్ అయ్యాయి. కేవలం దేశవ్యాప్తంగా రూ.4 కోట్లు రాబట్టిందీ చిత్రం. రూ.250 కోట్ల భారీ బడ్జెట్లో తెరకెక్కిన సినిమాకు తొలి నాలుగు రోజుల్లో రూ.50 కోట్ల వసూళ్లు కూడా రాకపోవడం దారుణం. హృతిక్ లాంటి పెద్ద స్టార్ నటించి, పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాకు ఈ దుస్థితి వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు.
This post was last modified on October 4, 2022 3:21 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…