అక్టోబర్ 1న ”అల్లూ స్టూడియోస్” మెగా లాంచ్ అంటూ ముందునుండి వినబడిన రూమర్లన్నీ నిజమయ్యాయ్. మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్టుగా ఆ కార్యక్రమాన్ని అల్లు అరవింద్ సక్సెస్ ఫుల్ గానే చేశారు. అయితే ఈ న్యూస్ తో పాటు వచ్చిన మరో న్యూస్ ఏంటంటే.. ఆల్రెడీ అల్లు స్టూడియోస్ ప్రాంగణంలో రెండు స్టూడియో ఫ్లోర్స్ కట్టేశారు కాబట్టి, అందులో ఒకదానిలో ”పుష్ప 2” కోసం సెట్స్ వేశారనే టాక్ వినిపించింది. పైగా స్టూడియో ఓపెనింగ్ అయిన రెండో రోజు నుండే షూటింగ్ కూడా మొదలవుతోంది అన్నారు. ఇంతకీ అదేమైంది?
నిజానికి అల్లూ స్టూడియోస్ ఓపెనింగ్ మీట్ లో అసలు క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ ఎక్కడా కనిపించలేదు. అఫ్ కోర్స్.. కేవలం తాము అవార్డు ఇచ్చిన సెలబ్రిటీలను మాత్రమే అక్కడకు పిలిచుంటారు అనుకుందాం. కాని ప్రస్తుతం సినిమాను చేస్తున్న సుకుమార్ ను తప్పకుండా పిలిచే ఉంటారుగా. ఏమైందో తెలియదు కాని, సుకుమార్ అక్కడ కనిపించకపోవడం, అలాగే సుకుమార్ తీస్తున్న పుష్ప 2 సినిమా షూటింగ్ ఇంకా మొదలవ్వకపోవడం అభిమానులను కలవరపెడుతోంది. ఇకపోతే ఒక తాజా అప్డేట్ ఏంటంటే.. పుష్ప 2 మొదలవ్వడానికి ఇంకాస్త టైమ్ పడుతుందట. దసరా పండుగ పూర్తయిన తరువాతనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తారని అంటున్నారు. అప్పటివరకు సుకుమార్ ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంటాడట.
ఒకవైపు అల్లు అర్జున్ కూడా పుష్ప 2 ఇంకా మొదలవ్వలేదు కాబట్టి, చక్కగా యాడ్స్ షూట్ చేసుకుంటున్నాడు. పస్తుతం త్రివిక్రమ్ డైరక్షన్లో జొమాటో ఫుడ్ డెలివరీ యాప్ యాడ్ చేస్తున్నాడట. ఆ తరువాత మరో పెద్ద బ్రాండ్ కోసం కూడా షూటింగ్ చేసే ఛాన్సుంది.
This post was last modified on October 3, 2022 6:44 pm
ఏటా జనవరి వస్తోంది.. పోతుంది... సంవత్సరాలు మారుతూ క్యాలెండర్ మారుతున్నాయి అంటూ ఏపీసీసీ చీఫ్ షర్మిల గుర్తు చేస్తున్నారు. ఇది…
తెలంగాణ శాసన మండలి శీతాకాల సమావేశాలు ముగిశాయి. ఈ సీజన్లో మొత్తం 5 రోజుల పాటు మాత్రమే ఈ సమావేశాలు…
టీమ్ ఇండియా యువ ఆటగాళ్లు శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ ఆట తీరు గురించి సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్…
నిన్న మొన్నటి వరకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అధికారులను, పోలీసులను కూడా బెదిరించిన విషయం తెలిసిందే. తాట…
పర్యాటకానికి ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా 2024-2029 స్వర్ణాంధ్ర టూరిజం పాలసీ అమల్లోకి వచ్చింది. 2030…
ఏపీ రాజధాని అమరావతి రైతుల విషయంలో మరోసారి సీఎం చంద్రబాబు తన మనసు చాటుకున్నారు. రైతుల నుంచి వచ్చిన అభ్యంతరాలను…