ఒక భాషలో విజయవంతం అయిన సినిమా ఇంకో భాషలో అక్కడి ప్రేక్షకులకు అంతగా రుచించని సందర్భాలు అప్పుడప్పుడూ కనిపిస్తుంటాయి. ఇందుకు నేటివిటీ ఫ్యాక్టర్, ప్రేక్షకుల అభిరుచుల్లో తేడా కారణం అవుతుంటాయి. ఐతే ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పొన్నియన్ సెల్వన్’ విషయంలో ఈ వైరుధ్యం చాలా చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఓవైపు తమిళ ప్రేక్షకులేమో ఈ సినిమాను ఆహా ఓహో అంటూ పొగిడేస్తున్నారు. దీన్నొక అద్భుతంగా, కళాఖండంగా అభివర్ణిస్తున్నారు. కానీ తెలుగు ప్రేక్షకులేమో ఇదేం సినిమారా బాబూ అంటూ దండం పెట్టేస్తున్నారు. కనీసం సినిమా పర్వాలేదు అంటున్న వాళ్లు కూడా అరుదు.
‘బాహుబలి’తో పోల్చి చూస్తే ఈ చిత్రం అసలేమాత్రం రుచించదన్న విషయం వాస్తవమే. దాంతో పోలిక లేకుండా, ఓపెన్ మైండ్‌తో చూసినా ‘పొన్నియన్ సెల్వన్’ మన వాళ్లకు ఏమంత గొప్పగా అనిపించడం లేదు. మణిరత్నం అంట పడిచచ్చే, ఆయన మార్కు క్లాస్ చిత్రాలను బాగా ఇష్టపడే ప్రేక్షకులు సైతం ‘పొన్నియన్ సెల్వన్’ విషయంలో నిరాశనే వ్యక్తం చేస్తున్నారు. ఎలివేషన్లు, భారీ యాక్షన్ ఘట్టాలు, విజువల్ ఎఫెక్ట్స్ వంటి అంశాలను పక్కన పెట్టేసి మామూలుగా చూసినా కథాకథనాల్లో అంత ప్రత్యేకత ఏమీ కనిపించట్లేదు మనవాళ్లకు. ఇలాంటి సినిమాను తమిళ ప్రేక్షకులు అంతగా కొనియాడుతుండడం.. సినిమా చూసేందుకు అలా ఎగబడుతుండడం విడ్డూరంగా అనిపిస్తోంది మనవాళ్లకు. వాళ్లేమో మన ప్రేక్షకులకు టేస్టు లేదని, బాహుబలి లాంటి ఇల్లాజికల్ సినిమాతో పోల్చి ‘పొన్నియన్ సెల్వన్’ను తక్కువ చేస్తున్నారని విరుచుకు పడుతున్నారు.
ఇక వసూళ్ల పరంగా చూసినా.. తమిళ వెర్షన్‌కు, మిగతా వాటికి అసలు పోలిక లేదు. తమిళంలో ‘పొన్నియన్ సెల్వన్’ రికార్డుల మోత మోగిస్తూ ఆల్ టైం బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా అడుగులు వేస్తోంది. కానీ తెలుగులో బ్యాడ్ టాక్ వల్ల వసూళ్లు చాలా తక్కువగానే వస్తున్నాయి. కనీసం తెలుగులో ఈ సినిమా గురించి ఈ చర్చ అయినా జరుగుతోంది. ఓపెనింగ్స్ పర్వాలేదు. కానీ హిందీలో ‘పొన్నియన్ సెల్వన్’ గురించి అసలు డిస్కషనే లేదు. అక్కడి ప్రేక్షకులు ఈ సినిమాను ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
This post was last modified on October 2, 2022 5:45 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…