40 ఏళ్ళు పైబడ్డాయ్. ఆల్రెడీ ఒక పాపకు తల్లైంది కూడా. అయితే ఇవేమీ గ్లామరస్ రోల్స్ చెయ్యడానికి అడ్డంకి కాదని ఇప్పటికే కరీనా కపూర్ వంటి హీరోయిన్లు ప్రూవ్ చేశారు. బహుశా అందుకేనేమో, ఇప్పుడు మాజీ హీరోయిన్ శ్రీయ సరన్ కూడా అదే రూట్లో పరిగెడుతోంది. గత రెండు రోజుల నుండి తన గమ్మత్తయిన ఫోటోలతో మతులు పోగొడుతోంది. ఇప్పుడున్న పెద్ద పెద్ద స్టార్ హీరోలందరితోనో ఒకప్పుడు జతకట్టేసిన శ్రీయ, ఇప్పుడు సడన్ గా ఇలా రెచ్చిపోవడానికి కారణమేంటబ్బా?
తమిళనాట బాగా పాపులర్ అయిన ఒక ఫోటోగ్రాఫర్ తో బాగా ఘాటైన షూట్ ఒకటి చేయించుకుని దానిని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది శ్రీయ. ఈ అమ్మడు సడన్ గా రెచ్చిపోవడంతో చూపరులు కూడా ఖంగుతింటున్నారులే. అయితే ఉన్నటుండీ ఈ అందాల ఒలకబోత ఎందుకంటే.. డిజిటల్ మరియు ఓటిటి యుగం కంటే ముందే చాలా బాషల్లో నటించేసిన శ్రీయ, ఈ కొత్త ఫార్మాట్ వచ్చాక సినిమాలు పట్టుకోలేకపోవడమే అందుకు కారణం అనిపిస్తోంది. ఫారిన్ పిల్లోడ్ని పెళ్ళిచేసుకొని చాలారోజులు సినిమాలకు దూరంగా ఉండి, ఆ తరువాత చాలావరకు డీ-గ్లామ్ పాత్రలకే అంకితమైంది. ఆమె అందాల ఆరబోత పొయ్యదనో, లేకపోతే అలాంటి పాత్రలకు సెట్టవ్వదనో మనోళ్ళు అలాంటి ఆఫర్లేవీ ఇవ్వలేదనుకుంట. బహుశా అందుకేనేమో ఇప్పుడిలా వేడి వేడి వడ్డనతో ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.
ఈ మధ్య కాలంలో 40 దాటిన మీరా జాస్మిన్ కూడా ఇదే తరహాలో ఇనస్టాగ్రామ్ లో రెచ్చిపోతోంది. మరి ఈ భామలకు మన డైరక్టర్లు పిలిచి గ్లామరసం పండించే రోల్స్ ఆఫర్ చేస్తారా? లేదంటే కేవలం వాళ్ళ ఇనస్టా ఫోటోలకు లైకులు కొట్టేసి చేతులు దులిపేసుకుంటారా అనేది తెలియాలంటే.. కొంతకాలం ఆగాల్సిందే.
This post was last modified on October 2, 2022 1:02 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…