డీగ్లామరస్, రగ్డ్ క్యారెక్టర్లు చేయాలంటే తమిళ హీరోల తర్వాతే అన్నట్లుండేది ఒకప్పుడు. అజిత్, సూర్య, విక్రమ్, ధనుష్.. ఇలా అక్కడి స్టార్ హీరోలందరూ డీగ్లామరస్ క్యారెక్టర్లతో మంచి పేరు సంపాదించిన వారే. ఆ సినిమాలు చూసి మనవాళ్లు కూడా ఔరా అనుకునేవారు. మన హీరోలు ఎప్పుడూ గ్లామర్‌గా కనిపించడానికే ఇష్టపడతారని, ఇలాంటి వైవిధ్యమైన, సహజంగా అనిపించే పాత్రలు చేయనే చేయరని.. అళాంటపుడు సినిమాల్లో, పాత్రల్లో కొత్తదనం ఎలా వస్తుందని అనేవాళ్లు. కానీ గత కొన్నేళ్లలో ట్రెండ్ మారింది. మన గ్లామర్ కవర్ తీసేసి సహజంగా, ఇంకా చెప్పాలంటే అంద విహీనంగా కనిపించడానికి బాగానే ఆసక్తి చూపిస్తున్నారు.
రామ్ చరణ్ ‘రంగస్థలం’ కోసం పూర్తిగా ఎలా అవతారం మార్చేశాడో తెలిసిందే. జుట్టు, గడ్డం బాగా పెంచి గల్ల చొక్కా, లుంగీ తొడుక్కునే కనిపించాడు సినిమా అంతటా. ఈ పాత్రకు, సినిమాకు అద్భుతమైన స్పందన వచ్చింది.
ఇక ‘పుష్ప’ కోసం అల్లు అర్జున్ మరింత డీగ్లామరస్‌గా తయారయ్యాడు. ట్రాన్స్‌ఫర్మేషన్లో ఇది వేరే లెవెల్ అనిపించాడు. ఐతే ఆ సినిమా విడుదలకు ముందు తన లుక్స్ చూసి బన్నీ మరీ శ్రుతి మంచిపోతున్నాడేమో, ఇంత డీగ్లామర్‌ను మన వాళ్లు తట్టుకోగలరా అని సందేహించారు. కానీ ‘పుష్ప’ కొంత మిక్స్‌డ్ రెస్పాన్స్‌తోనే మొదలై బ్లాక్‌బస్టర్ అయింది. మరి ‘పుష్ప-2’ల బన్నీ ఎలా కనిపిస్తాడో చూడాలి.
ఈలోపు నేచురల్ స్టార్ నాని ‘దసరా’ కోసం పూర్తిగా అవతారం మార్చేశాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ చూసినపుడే జనాలు షాకయ్యారు. టాలీవుడ్ యువ కథానాయకుల్లో అందగాళ్లలో ఒకడైన నాని ఇంత డీగ్లామర్‌గా తయారయ్యాడేంటి అనుకున్నారు. కానీ ఇప్పుడు రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ ఇంకా షాకింగ్‌గా ఉంది. దీన్ని డీగ్లామర్ అని కూడా చెప్పలేం. మేకోవర్ మరీ శ్రుతి మించి నాని ఏమైనా సైకో విలన్ పాత్ర చేస్తున్నాడా అన్న స్థాయిలో ఉందా పోస్టర్. ‘పుష్ప’ను చూసి మరీ ఎక్కువ ఇన్‌స్పైర్ అయిపోయారేమో అనిపిస్తోంది. సినిమా అంతటా నానిని ఇలా చూసి యూత్ ఆడియన్స్, ముఖ్యంగా అమ్మాయిలు తట్టుకోగలరా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
This post was last modified on October 1, 2022 6:15 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…