మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో #SSMB28 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటివలే ఓ యాక్షన్ ఎపిసోడ్ తో మొదటి షెడ్యుల్ జరుపుకున్న ఈ సినిమాకు సంబంధించి రెండో షెడ్యుల్ త్వరలోనే మొదలు కానుంది. తాజాగా మహేష్ అమ్మ ఇందిరా దేవి మరణంతో సెకండ్ షెడ్యుల్ కి బ్రేక్ పడింది. దీంతో ఆ షెడ్యుల్ ప్లానింగ్ మారింది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఫర్ ది ఫస్ట్ టైం మహేష్ కోసం త్రివిక్రమ్ ఐటెం సాంగ్ పెట్టనున్నాడనేది ఆ న్యూస్.
లేటెస్ట్ గా ఈ విషయంపై నిర్మాత నాగ వంశీ స్పందించాడు. సినిమాలో ఐటెం సాంగ్ పెట్టాలని అనుకుంటున్న మాట వాస్తవమే. కానీ ఇంకా డిసిషన్ తీసుకోలేదు. మహేష్ గారి ఫ్యాన్స్ , మాస్ ప్రేక్షకుల కోసం ఐటెం సాంగ్ పెడితే బాగుంటుందని త్రివిక్రమ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆయన ఇంకా డిసిషన్ తీసుకోలేదంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇక మహేష్ – త్రివిక్రమ్ గార్ల కాంబోలో వచ్చిన ‘అతడు’, ‘ఖలేజా’ రెండూ థియేటర్స్ లో అనుకున్నంత ఆదరణ అందుకోలేకపోయాయి. ఆ సినిమాలు టివీ లో బిగ్గెస్ట్ వ్యూస్ అందుకున్నాయి. కానీ ఈసారి ఈ కాంబో మీద ఎన్ని అంచనాలు పెట్టుకున్నా వాటిని మించి సినిమా ఉండబోతుందని నమ్మకం వ్యక్తం చేశాడు నాగ వంశీ.
బేసిక్ గా త్రివిక్రమ్ సినిమాల్లో ఐటెం సాంగ్ ఉండదు. కానీ ఆ స్పెషల్ పబ్ సాంగ్ పెడుతుంటాడు. ఇప్పుడు మహేష్ బాబు కోసం తన సినిమాలో మరో కమర్షియల్ ఎలిమెంట్ ఫిక్స్ చేయబోతున్నాడు. త్వరలోనే ఈ విషయంపై పూర్తి క్లారిటీ రానుంది. మరి మహేష్ కోసం త్రివిక్రమ్ తన పంథా మార్చుకొని సుకుమార్ లా ఐటెం సాంగ్ తో హంగామా చేస్తాడేమో చూడాలి.
This post was last modified on October 1, 2022 2:38 pm
తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…
ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…
కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఒకవైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచన చేస్తామంటే కుదురుతుందా? అంటే కాదన్నది అందరికీ తెలిసిందే. కానీ,…
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…