Movie News

సెల్వన్ – మనకు ముప్పు తగ్గెన్

ఏదో అద్భుతం చేస్తుందనుకున్న పొన్నియన్ సెల్వన్ 1 ఆ స్థాయిలో స్పందన దక్కించుకోలేకపోయింది. తమిళంలో అతి పెద్ద మల్టీ స్టారర్ కావడంతో అక్కడ ఓపెనింగ్స్ భారీగా వచ్చాయి కానీ మనదగ్గర మాత్రం నగరాలు మినహాయించి కింది సెంటర్లలో చెప్పుకోదగ్గ నెంబర్లు నమోదు కాలేదు. ఒకవేళ టాక్ బ్రహ్మాండంగా వచ్చి ఉంటే పికప్ అయ్యేదేమో కాని ఈ రెండు రోజులు దాటితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టమే. ఏదో అద్భుతం జరిగితే తప్ప టార్గెట్ పెట్టుకున్న పది కోట్ల మార్కుని అందుకోవడం సులభం కాదు. విక్రమ్ కు యునానిమస్ గా పాజిటివ్ టాక్ వస్తేనే బ్రేక్ ఈవెన్ అందుకోగలిగింది.

సరే దీని వల్ల మనకు తప్పిన ముప్పేమిటనుకుంటున్నారా. అక్కడికే వద్దాం. ఒకవేళ పిఎస్ 1కు సూపర్ రెస్పాన్స్ వచ్చి ఉంటే అక్టోబర్ 5న గాడ్ ఫాదర్, ది ఘోస్ట్, స్వాతిముత్యంలకు ఇబ్బంది కలిగేది. థియేటర్ల కౌంట్ దగ్గర పంచాయితీ పడేది. కానీ ఇప్పుడా సమస్య లేదు. ఆ సమయానికి ఇది నెమ్మదించడం ఖాయం. తక్కువ స్క్రీన్లున్న కేంద్రాల్లో తెలుగు స్ట్రెయిట్ సినిమాలు వేసుకోవడానికి రూట్ క్లియర్ అయ్యింది. ముఖ్యంగా స్వాతిముత్యంకు ఈ పరిణామం ఉపయోగపడుతుంది. ఆ రోజుకు పిఎస్ 1 మొదటి వారం పూర్తి కాకపోయినా రెండు రోజులు ఆగితే చాలు ఫస్ట్ వీక్ అగ్రిమెంట్లు పూర్తవుతాయి కాబట్టి థియేటర్లు ఫ్రీ అవుతాయి.

మొత్తానికి పొన్నియన్ సెల్వన్ ఫలితం టాలీవుడ్ కు అనుకూలంగానే మారిందని చెప్పాలి. దసరా బరిలో దిగే చిత్రాలకు ఇది సానుకూలాంశం. కాకపోతే మణిరత్నం మూవీకి కలిగిన అడ్వాంటేజ్ ఒకటి లేకపోలేదు. ఏపి తెలంగాణలో స్కూల్స్ కాలేజీల సెలవులు సెప్టెంబర్ 26 నుంచే మొదలయ్యాయి. అక్టోబర్ ఆరు నుంచి పదో తేదీ దాకా ఇవి కొనసాగనున్నాయి. అంటే పండగ రోజు వరకు జనానికి ఉన్న పెద్ద ఆప్షన్ పిఎస్ 1 ఒకటే. ఈ అవకాశాన్ని సరిగ్గా వాడుకుని ఉంటే ఇంకో లెవెల్ లో ఉండేది. మన సంగతి ఎలా ఉన్నా తమిళనాడు, కేరళలో మాత్రం రికార్డులు ఖాయమేనట.

This post was last modified on October 1, 2022 7:03 am

Share

Recent Posts

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

2 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

2 hours ago

వీసా చేతిలో ఉన్నా రద్దే… అమెరికా కొత్త చెకింగ్ ఇదే!

అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…

2 hours ago

బొద్దింక‌ల నిర‌స‌న‌… ఈసారి ఇంకా గట్టిగా!!

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ).. తాజాగా మ‌రో ఉద్య‌మానికి తెర‌దీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…

2 hours ago

ఆ పరిస్థితిలో హనుమాన్ చాలీసాను పఠించిన కెప్టెన్

హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్ర‌మించేవారు కొంద‌రైతే.. తాము చేసిన ప‌నుల కార‌ణంగా చూపిన ధైర్య సాహ‌సాల కార‌ణంగా రాత్రికి…

4 hours ago

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

5 hours ago