నిన్న మొన్నటి దాకా చాలా పరిమితంగా ఉన్న శాండల్ వుడ్ మార్కెట్ ని కెజిఎఫ్ రూపంలో ఒక్కసారిగా వేయి కోట్ల స్థాయికి చేర్చిన ఘనత నిర్మాణ సంస్థ హోంబాలే ఫిలింస్ కి దక్కుతుంది. ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ ని సైతం దానికి రెట్టింపు స్థాయిలో తీర్చిదిద్దుతున్న సంగతి తెలిసిందే. రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్ టైనర్స్ కి దూరంగా విభిన్నమైన కథలను ఎంచుకుంటూనే భారీ బడ్జెట్ లతో డబ్బును ఖర్చు చేసే విషయంలో ఏ మాత్రం రాజీపడని సంస్థగా నేషనల్ మీడియా దృష్టిలోనూ పడింది. ఇప్పుడీ బ్యానర్ కి మరో జాక్ పాట్ దక్కింది. దాని పేరు కంటర(సంస్కృత అర్థం దట్టమైన అడవి).
పొన్నియన్ సెల్వన్ 1 పోటీని ఏ మాత్రం లెక్కచేయకుండా ఈ సినిమాను కర్ణాటకలో భారీ ఎత్తున్న రిలీజ్ చేశారు. తమిళం తెలుగు కూడా అనుకున్నారు కానీ థియేటర్ల సమస్యతో పాటు ప్రమోషన్ కు టైం లేకపోవడం వల్ల ఆ నిర్ణయం వాయిదా వేసుకున్నారు. ఇప్పుడీ కంటరకు విమర్శకుల ప్రశంసలతో పాటు ఆడియన్స్ మెప్పులు అందుతున్నాయి. అటవీ సంపదను రక్షించే విషయంలో ఒక ఫారెస్ట్ ఆఫీసర్ కి, అక్కడే ఉంటూ తాతలు తండ్రుల వృత్తిని నమ్ముకున్న యువకుడికి మధ్య అంతర్యుద్ధాన్ని నేపథ్యంగా తీసుకున్నారు. గత ఏడాది గరుడ గమన వృషభ వాహనతో వావ్ అనిపించిన రిషబ్ శెట్టి దీనికి హీరో కమ్ దర్శకుడు.
విలేజ్ నేటివిటీ అయినప్పటికీ చాలా నిజాయితీగా కంటరను తెరకెక్కించిన తీరు అబ్బురపరుస్తుంది. అసలు మనం చూస్తోంది సినిమానేనా అనిపించేలా సరికొత్త అనుభూతినిస్తూ చాలా అరుదుగా చూసే రాతి ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. సాంకేతిక వర్గం పోటీపడుతూ పని చేస్తే ఎలా ఉంటుందో దానికి మంచి ఉదాహరణగా ఈ మూవీ గురించి చెప్పుకోవచ్చు. హ్యాపీ నుంచి ఆచార్య దాకా తెలుగు సినిమాల్లోనూ రెగ్యులర్ గా కనిపించే కిషోర్ ఇందులో పోలీస్ అధికారిగా అదరగొట్టేశాడు. క్యాస్టింగ్ చాలా సహజంగా ఉంది. రా డ్రామాలను ఇష్టపడే వాళ్లకు కంటర నచ్చేస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ షాక్ ఇస్తుంది. తెలుగులో త్వరలోనే రావొచ్చు.
This post was last modified on October 1, 2022 6:58 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…