ఈ దసరా పండుగకు టాలీవుడ్ కింగ్ నాగార్జున నుంచి ‘ది ఘోస్ట’ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించింది. సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా సాగే ఔట్ అండ్ ఔట్ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ ఇది. ఇందులో ఇంటర్ పోల్ ఆఫీసర్ గా ఫిరోషియస్ అండ్ టెర్రిఫిక్ లుక్ లో నాగ్ కనిపించబోతున్నారు. అలాగే ఈ చిత్రంలో నాగార్జున సోదరిగా బాలీవుడ్ నటి గుల్ పనగ్ నటించారు.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ నారంగ్, సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి భరత్ సౌరభ్, మార్క్ కె రాబిన్ సంగీత దర్శకులిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే బయటకు వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి.
మరింత బజ్ ను క్రియేట్ చేసేందుకు మరోవైపు మేకర్స్ విసృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. అదేంటంటే ఈ సినిమాకు నాగార్జున రెమ్యునరేషన్ వద్దన్నారట. సాధారణంగా నాగార్జున ఒక్కో సినిమాకు రూ. 6 నుంచి 7 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకునేవారని టాక్ ఉంది.
కానీ, ‘ది ఘోస్ట్’పై ఉన్న నమ్మకంతో రెమ్యునరేషన్‌కు బదులుగా నాగార్జున నాలుగు ఏరియాల థియేట్రికల్ హక్కులను తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. వైజాగ్, ఈస్ట్, వెస్ట్, గుంటూరు ఏరియాలలో ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై పంపిణీ కానుందని అంటున్నారు. మరి ఈ ప్రచారమే నిజమై ‘ది ఘోస్ట్’ ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుందంటే.. ఏపీలోని ఏరియాల ద్వారా వచ్చే మొత్తం నాగ్ రెమ్యునరేషన్ అవుతుందని టాక్ నడుస్తోంది.
కాగా, ఈ దసరా పండుగకు నాగార్జున ‘ది ఘోస్ట్’తో పాటు మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమా సైతం విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. మలయాళ హిట్ ‘లూసిఫర్’కు రీమేక్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించాడు. రీమేక్ మూవీ అయినప్పటికీ ‘గాడ్ ఫాదర్’పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. దీంతో దసరాకు ఇద్దరు సీనియర్ స్టార్ల మధ్య బాక్సాఫీస్ పోరు ఎంతో ఆసక్తికరంగా మారింది.
This post was last modified on September 30, 2022 3:28 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…