ప్రతి హీరోకు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన జానర్, స్టైల్, సబ్జెక్ట్ సెన్స్ ఉంటుంది. దానికి లోబడే కథలను రాసుకుంటారు దర్శకులు. ఉదాహరణకు రజనీకాంత్ కు మేనరిజమ్స్, బాలయ్యకు ఫ్యాక్షన్, చిరంజీవికి కమర్షియాలిటీ, నాగార్జునకు ఎక్స్ పరిమెంట్, వెంకటేష్ కు ఫ్యామిలీ ఇలా అందరికీ ఒక స్కూలంటూ ఏర్పడింది. ఇప్పటి జనరేషన్ స్టార్లు ఇలా గిరి గీసుకోకుండా వీలైనన్ని ప్రయోగాలు చేస్తున్నారు కానీ కొన్నిసార్లు క్లిక్ అవ్వడం కొన్ని సార్లు మిస్ ఫైర్ కావడం జరుగుతూనే ఉంటుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చిన అల్లు శిరీష్ ఇప్పటికీ ఎలాంటి బ్రాండ్ ఏర్పరుచుకోలేకపోయాడు.
ఇతని కొత్త సినిమా ఊర్వశివో రాక్షసివో నవంబర్ 4 విడుదలకు రెడీ అవుతోంది. అదే రోజు ప్లాన్ చేసుకున్న శాకుంతలం డ్రాప్ కావడంతో మేలే జరిగింది. నిజానికిది ఎప్పుడో పూర్తయ్యింది. మొదట్లో ప్రేమ కాదంట టైటిల్ తో తీసుకుంటూ వచ్చారు. పోస్టర్లు, చిన్న టీజర్ వచ్చి చాలా కాలమయ్యింది. రాకేష్ శశి దర్శకత్వంలో తమిళ హిట్ ప్యార్ ప్రేమ కాదల్ రీమేక్ గా దీన్ని రూపొందించారు. ఈ రాకేష్ ఎవరో కాదు. మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ని విజేతతో లాంచ్ చేసింది ఇతనే. బొమ్మ తేడా కొట్టి గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. తర్వాత గీతా కాంపౌండ్ లో పడ్డాడు.
ఇదంతా ఓకే కానీ టీజర్ చూశాక అల్లు శిరీష్ మీద ఇంత హెవీ రొమాన్స్ వర్కౌట్ అవుతుందానే అనుమానం రాకమానదు. అను ఇమ్మానియేల్ హీరోయిన్ గా నటించిన ఊర్వశివో రాక్షసివోలో లీడ్ పెయిర్ మధ్య ఘాటైన కెమిస్ట్రీ బలంగా కనిపిస్తోంది. డైలాగులు కూడా దాన్నే సూచిస్తున్నాయి. స్నేహం, ప్రేమ మధ్య కన్ఫ్యూజన్ లో శారీరక సంబంధం దాకా వెళ్లిన ఓ అమ్మాయి అబ్బాయి కథ ఇది. లైన్ మరీ కొత్తేమి కాదు కానీ ఒరిజినల్ వెర్షన్ ట్రీట్ మెంట్ లో ఉన్న ఫ్రెష్ నెస్ వల్ల యూత్ కి కనెక్ట్ అయ్యింది. వాళ్లనే నమ్ముకుని శిరీష్ తో ఈ రిస్క్ చేస్తున్నారు. 2013 గౌరవంతో డెబ్యూ చేసిన అల్లు తమ్ముడి ఇదైనా బ్రేక్ ఇస్తుందేమో లెట్ సీ.
This post was last modified on September 29, 2022 7:51 pm
కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు…