చాలారోజుల తర్వాత ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో మంచి మాస్ హిట్టు కొట్టాడు పూరీ జగన్నాథ్. ఇస్మార్ట్ ఇచ్చిన జోరుతో విజయ్ దేవరకొండతో ‘ఫైటర్’ చేస్తున్నాడు. బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండేను హీరోయిన్‌గా ఎంపిక చేసిన పూరీ, ‘ఫైటర్’ను హిందీలోనూ గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాడు. ఈ మూవీ హిట్టయితే, పూరీ బాలీవుడ్‌లో బిజీ డైరెక్టర్ అవుతాడని భావించారంతా. అయితే పూరీ ప్లాన్ మాత్రం వేరేగా ఉంది.
‘ఫైటర్’ రిజల్ట్‌తో సంబంధం లేకుండా నందమూరి బాలకృష్ణతో తన తర్వాతి సినిమా ఉంటుందని ప్రకటించాడు పూరీ. ఇంతకుముందు వీరి కాంబోలో ‘పైసా వసూల్’ మూవీ వచ్చింది. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా బాలయ్యబాబును పూరీ చూపించిన విధానం అభిమానులకు తెగ నచ్చేసింది. క్రేజీ మేనరిజం అండ్ డిఫరెంట్ స్టైల్‌తో బాలయ్యతో రచ్చ రచ్చ చేయించాడు పూరీ.
నిజానికి గురువు రామ్‌గోపాల్ వర్మ ఇక్కడి నుంచి వెళ్లి, బాలీవుడ్‌లో కొన్నేళ్లపాటు పాగా వేశాడు. పూరీ కూడా హిందీలో రెండు సినిమాలు తీశాడు కానీ పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇప్పుడు విజయ్‌కి అక్కడున్న క్రేజ్‌తో ‘ఫైటర్’ హిట్టయితే, పూరీ బాలీవుడ్‌లో పాగా వేస్తాడని, అక్కడ మెగా ప్రాజెక్ట్స్‌తో బిజీ అయిపోతాడని అనుకున్నారంతా. కానీ పూరీ మాత్రం టాలీవుడ్‌కే ప్రాధాన్యం ఇస్తున్నాడు.
అదీగాక నాలుగు వరుస ఫ్లాపులతో ఉన్న సమయంలో తనకు 101వ సినిమా డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చాడు బాలయ్య. అందుకే ‘ఫైటర్’ తర్వాత బాలకృష్ణతో సినిమా చేయాలని, స్క్రిప్ట్ పనులు పూర్తి చేసే పనిలో పడ్డాడట పూరీ. బోయపాటి శ్రీనుతో తన తర్వాతి సినిమాను కన్ఫార్మ్ చేసిన బాలయ్య, పూరీ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పడం దాదాపు లాంఛనమే.
This post was last modified on April 22, 2020 1:44 pm
సహజంగా మూడు ఋతువులు వుంటాయి. నాలుగు నెలలు శీతాకాలం, నాలుగు నెలలు వేసవి కాలం, మరో నాలుగు నెలలు వర్షా…
ఒక్క ఫ్లాప్ కొందరు స్టార్ డైరెక్టర్ల ప్లానింగ్ ని ఎంత ప్రభావితం చేస్తుందో చెప్పడానికి లోకేష్ కనగరాజ్ ఉదాహరణ చాలు.…
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత అక్రమాస్తుల కేసులో ఈడీ స్పీడ్ పెంచడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఉన్నట్టుండి…
మన టాలీవుడ్ స్టార్లు ఇప్పుడు లోకల్ మార్కెట్ ను దాటేసి అంతకుమించి అనేలా అడుగులు వేస్తున్నారు. నార్త్ ఆడియన్స్ తో…
యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నుంచి ఒక టైంలో వచ్చిన సినిమాలు చూస్తే.. తన పనైపోయిందనే అనిపించింది. ఐతే కెరీర్…
గత రెండు రోజులుగా ఇటు సోషల్ మీడియాలోను, అటు ప్రధాన మీడియా ఛానెళ్లలోను.. తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం.. ప్రపంచ…