నిన్న ‘గాడ్ ఫాదర్’ రిలీజైన దగ్గర్నుంచి మెగాస్టార్ చిరంజీవిని ఒక వర్గం కించపరిచేలా పోస్టులు పెడుతోంది సోషల్ మీడియాలో. అందులో చాలా వరకు మెగా ఫ్యామిలీ అంటే పడని యాంటీ ఫ్యాన్సే ఉన్నారన్నది స్పష్టం. ఆ వర్గం హీరోల సినిమాలు రిలీజైనపుడు మెగా అభిమానులు చేసే పని కూడా ఇదే అని అందరికీ తెలుసు. ఇక చిరును ఏ విషయంలో ట్రోల్ చేస్తున్నారన్నది చూద్దాం.
మలయాళంలో మోహన్ లాల్‌తో పోలిస్తే చిరు అన్ని రకాలుగా తేలిపోయారట. ఇందుకు ఉదాహరణగా ఒక సన్నివేశంలో పోలీస్ ఆఫీసర్‌ను గోడకు ఆనించి కాలితో తంతున్న సన్నివేశాన్ని చూపిస్తున్నారు. ఒరిజినల్లో మోహన్ లాల్ తన కాలిని పైకి లేపి పోలీస్ ఆఫీసర్ గుండెల మీదికి తంతున్నట్లు పోజు ఉండగా.. ‘గాడ్ ఫాదర్’లో చిరు మాత్రం దానికి భిన్నంగా పోలీస్ ఆఫీసర్ని కుర్చీలో ఉంచి తంతున్నాడు. ఈ రెండు ఫొటోలు పక్క పక్కన పెట్టి చూస్తే మోహన్ లాల్‌దే స్ట్రైకింగ్‌గా ఉన్న మాట వాస్తవం. ఒక తమిళ క్రిటిక్ ఈ పోలిక పెట్టి చిరును కించపరిచే ప్రయత్నం చేశాడు.
ఐతే మోహన్ లాల్‌తో పోలిస్తే చిరు వయసు ఎక్కువ. ఇద్దరి మధ్య వయసు అంతరం ఐదేళ్లు. అందులోనూ మోహన్ లాల్ ఎంతైనా ఫిట్‌గా ఉంటారు. ఈ ఒక్క విషయంలో చిరుతో పోల్చి మోహన్ లాల్‌ను గొప్పగా చూపిస్తున్న వాళ్లు.. చిరు డ్యాన్సుల గురించి ఆలోచించాలి. ఇండియాలో ఆయన్ని మించి డ్యాన్సులు వేసిన వాళ్లు లేరు. మోహన్ లాల్ చిరు వేసే స్టెప్పుల్లో చిన్న స్టెప్ కూడా మ్యాచ్ చేయలేరు. ఇక ఫైట్లు, కామెడీ విషయంలోనూ చిరుదే స్పష్టమైన పైచేయి. అలా అని మోహన్ లాల్‌ను తక్కువ చేయడానికేమీ లేదు. ఆయన గొప్ప నటుడు. ఆయన ప్రత్యేకతలు ఆయనకున్నాయి. అసలు ఇలాంటి ఇద్దరు లెజెండ్స్‌ను పోల్చి చూసి ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని చెప్పడమే కరెక్ట్ కాదు.
This post was last modified on September 29, 2022 11:09 am
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్‌కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…