ఈ ఏడాది ప్రారంభంలో బంగార్రాజుతో మంచి సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న అక్కినేని నాగ చైతన్యకి గత రెండు సినిమాల ఫలితాలు తీవ్ర నిరాశ కలిగించాయి. ఎన్నో ఆశలు పెట్టుకుని కష్టపడి మేకోవర్ చేసుకుని నటించిన థాంక్ యు దారుణంగా డిజాస్టర్ కాగా అమీర్ ఖాన్ తో నటించడం గర్వకారణమే కాదు బాలీవుడ్ లో తనకో బెస్ట్ డెబ్యూ అవుతుందని నమ్మి చేసిన లాల్ సింగ్ చడ్డా చెప్పుకోలేన్నంత తీవ్రంగా బోల్తా కొట్టింది. అమెజాన్ ప్రైమ్ కోసం వెబ్ సిరీస్ దూత షూటింగ్ పూర్తి చేసిన చైతు ప్రస్తుతం తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో ఓ ప్రాజెక్టు చేస్తున్న సంగతి తెలిసిందే. కృతి శెట్టి ఇందులో హీరోయిన్.
ఇది కాకుండా పరశురామ్ పేట్లకు ఓ కమిట్ మెంట్ ఇచ్చాడు చైతు. అయితే ప్రస్తుతానికి దాన్ని హోల్డ్ పెట్టారని ఇన్ సైడ్ టాక్. స్క్రిప్ట్ విషయంలో పూర్తి ఏకాభిప్రాయం రాలేదట. అందుకే మరోసారి రిపేర్లు చేశాక అప్పుడు ఫైనల్ డెసిషన్ తీసుకుందామని చెప్పినట్టు వినికిడి. ఒకవేళ సర్కారు వారి పాట అంచనాలను మించి బ్లాక్ బస్టర్ అయ్యుంటే పరశురామ్ కి ఈ ఇబ్బంది వచ్చి ఉండేది కాదు. కానీ మహేష్ బాబు లాంటి స్టార్ దొరికినప్పుడు ఆయన్ని హ్యాండిల్ చేయడంలో పడిన తడబాటు పెద్ద ఇండస్ట్రీ హిట్ ని మిస్ చేసి జస్ట్ ఓకే హిట్ దగ్గర ఆగిపోవాల్సి వచ్చింది.
ఒక రకంగా ఇదీ కారణమైనా ఆశ్చర్యం లేదు. కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి చైతన్యకు అదేదో బ్యాడ్ లక్ లా ఒక హిట్టు దక్కితే ఆ వెంటనే రెండో మూడో పరాజయాలు పలకరించడం పరిపాటి అయ్యింది. అందుకే మార్కెట్ ఒక పరిమితికి మించి పెరగడం లేదు. అటు అఖిల్ కూడా స్ట్రగుల్ అవుతున్నాడు కానీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కొంత ఊరటనిచ్చాక ఏజెంట్ ని ప్యాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలతో చేస్తున్నాడు. చైతు పరశురామ్ లది క్యాన్సిల్ కాలేదు కానీ కొంచెం ఎక్కువ టైం పట్టేలా ఉంది. ఎలాగూ వెంకట్ ప్రభుది ఎంతలేదన్నా ఆరు నెలలు పడుతుందిగా.
This post was last modified on September 28, 2022 6:06 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…