2023 సంక్రాంతి పోరు వేడెక్కుతోంది. ఇంకో మూడు నెలలే టైం ఉండటంతో అఫీషియల్ గా లాక్ చేసుకోవడానికి నిర్మాతలు రెడీ అవుతున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూసిన ఆది పురుష్ కీలక అప్ డేట్ ని ఇవాళ దర్శకుడు ఓం రౌత్ పంచుకోవడంతో వాళ్ళ ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. జనవరి 12 సంక్రాంతి పండగను టార్గెట్ చేసుకుని వరల్డ్ వైడ్ థియేటర్ రిలీజ్ చేయబోతున్నట్టు కన్ఫర్మేషన్ ఇచ్చారు. బహుశా ఇండియన్ సినిమాలో కనివిని ఎరుగని స్థాయిలో దీని విడుదల ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఇక్కడే చిరంజీవి విజయ్ లకు చిక్కొచ్చి పడింది. వాల్తేర్ వీరయ్య(టైటిల్ ఖరారు కాలేదు) షూటింగ్ శరవేగంగా చేస్తున్నారు. గాడ్ ఫాదర్ ప్రమోషన్లు ఉన్నా సరే డెడ్ లైన్లు మీట్ కావాలనే ఉద్దేశంతో నాన్ స్టాప్ గా చిత్రీకరణ జరుపుతూనే ఉన్నారు. ఎలాగైనా సరే పండగ బరిలో దిగాలన్నది లక్ష్యం. పైగా రవితేజ డేట్లు ఇప్పుడు మిస్ చేసుకుంటే మళ్ళీ దొరకడం కష్టం కాబట్టి ఆ కోణం కూడా ఈ స్పీడ్ కి కారణం. ఇక వారసుడుని పొంగల్ కు తేవడం ఖాయమని ఇటీవలే పలు ట్వీట్ల ద్వారా దిల్ రాజు నిర్మాణ సంస్థ ఎస్విసి స్పష్టం చేసింది. పైగా విజయ్ కు ఇది సెంటిమెంట్ కూడా.
ఇప్పుడు ఆది పురుష్ వల్ల ఈ రెండింటికి ఇబ్బందులు తప్పవు. స్టార్ డం పరంగా ఎవరికెవరు తీసిపోని రేంజ్ లో ఉన్నా సరే ప్యాన్ ఇండియా అప్పీల్ పరంగా ఎక్కువ అడ్వాంటేజ్ ఉన్నది ప్రభాస్ కే. ముఖ్యంగా నార్త్ డిస్ట్రిబ్యూటర్లు ఎగబడి కొంటారు. పైగా ప్రొడ్యూసర్ టి సిరీస్ సంస్థ. ఒక్కసారి స్కెచ్ వేశారంటే ఉత్తరాది మొత్తం స్క్రీన్లు పట్టేస్తారు. వారసుడికి విజయ్ ఇమేజ్ ఒకటే అండదండా. అది మినహాయిస్తే ఇదో రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్ టైనరే. వీరయ్య సైతం ఊర మాస్ ని నమ్ముకున్నదే. సంక్రాంతికి రెండు మూడు పెద్ద సినిమాలకు స్కోప్ ఉంటుంది కానీ ఈసారి ఆది పురుష్ తో లెక్కలు అంత ఈజీగా ఉండవు.
This post was last modified on September 28, 2022 6:12 am
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…