సినీ రంగంలో అతి మంచితనానికి పోతే ఎంత ప్రమాదమో చెప్పడానికి యువ కథానాయకుడు శ్రీ విష్ణు ఉదంతాన్నే ఉదాహరణగా చూపిస్తున్నారు ఇండస్ట్రీ జనాలు. ఇండస్ట్రీలో తమ స్థాయికి మించి పారితోషకాలు తీసుకుని, అదనపు ఖర్చుల రూపంలో నిర్మాతల్ని బాదేసే, ప్రొడ్యూసర్ పరిస్థితి అర్థం చేసుకోకుండా ముక్కుపిండి తమకు రావాల్సిన వసూలు చేసుకునే హీరోలు చాలామందే ఉన్నారు కానీ.. నిర్మాతల చేతుల్లో మోసపోయే హీరోలు చాలా తక్కువ మందే. అందులో శ్రీ విష్ణు పేరు ముందు చెప్పుకోవాల్సి ఉంటుందన్నది ఇండస్ట్రీ వర్గాల మాట.
పారితోషకాల గురించి పట్టించుకోకుండా సినిమాలు చేస్తూ.. సినిమా బాగా ఆడితే, నిర్మాత బాగుపడితే చాలు అన్న మంచి ఆలోచన అతడి కొంప ముంచినట్లుగా ఇప్పుడు పరిశ్రమలో చర్చ జరుగుతోంది. బ్రోచేవారెవరురా వరకు అడపా దడపా హిట్లు కొడుతూ విష్ణు పరిస్థితి బాగానే ఉండేది.
ఐతే ఆ సినిమాతో కెరీర్ మరో స్థాయికి వెళ్తుందనుకుంటే వరుసగా పరాజయాలు పలకరించాయి. దీంతో తర్వాతి సినిమాలకు బిజినెస్ సరిగా జరగని పరిస్థితి నెలకొంది. శ్రీ విష్ణు సినిమాలకు మరీ ఎక్కువ ఖర్చేమీ కాదు. పరిమిత బడ్జెట్లోనే సినిమాలు తీస్తారు. పేరున్న నిర్మాతలైతే సినిమాలకు సరిగ్గా బిజినెస్ చేసి సినిమా కొంచెం అటు ఇటు అయినా పెద్దగా నష్టాలు రాకుండా చూసుకునేవారు. ఐతే అతడితో సినిమాలు చేసిన ప్రొడ్యూసర్ల వైఫల్యం వల్ల తన సినిమాలు ఆర్థికంగా మరింత దెబ్బ తిన్నాయి. దీంతో కొన్ని సినిమాలకు అతను పారితోషకం కూడా తీసుకోనట్లు సమాచారం.
ఇక లేటెస్ట్ రిలీజ్ అల్లూరి విషయంలో అయితే అతడికి ఆదాయం తెచ్చిపెట్టకపోగా.. చేతి నుంచి ఖర్చు పెట్టుకునేలా చేసినట్లు తెలిసింది. ఫైనాన్స్ క్లియర్ చేయకపోవడంతో సినిమాకు మార్నింగ్ షోలు పడలేదు. దీంతో శ్రీ విష్ణు ఆ డబ్బులేవో సెటిల్ చేసి సినిమాను రిలీజ్ చేయించాడు. కానీ బ్యాడ్ టాక్, బజ్ లేకపోవడం వల్ల సినిమాకు ఓపెనింగ్స్ రాలేదు. దీంతో సెటిల్ చేసిన డబ్బుల తాలూకు బాధ్యతంతా అతనే తీసుకోవాల్సి వచ్చిందట. ఈ సినిమాకు సంబంధించి విష్ణుకు రావాల్సిన రెమ్యూనరేషన్ కూడా అందలేదని సమాచారం. దీంతో ఇకపై పేరున్న బేనర్లు, నిర్మాతలతోనే సినిమాలు చేయాలని డిసైడైనట్లు సమాచారం. అతడి తర్వాతి సినిమాలు ఏకే ఎంటర్టైన్మెంట్స్, యువి క్రియేషన్స్, మైత్రీ మూవీ మేకర్స్‌లో కావడం గమనార్హం.
This post was last modified on September 26, 2022 10:56 pm
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…