ప్రభాస్ అభిమానుల దృష్ణంతా ఇప్పుడు ‘ఆదిపురుష్’ మీదే ఉంది. ఇప్పటికే ఎన్నోసార్లు వెండితెరపై చూసిన రామాయణ గాథను అత్యాధునిక టెక్నాలజీతో సరికొత్తగా ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ‘తానాజీ’ దర్శకుడు ఓం రౌత్. ఈ సినిమా గురించి ఓం రౌత్ ఎప్పుడు మాట్లాడినా చాలా ఎగ్జైట్ అవుతున్నాడు. తాజాగా ఆయనే కాదు.. ప్రభాస్‌కు ఆప్త మిత్రుడు, ప్రభాస్ పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్న ప్రభాస్ శీను ఒక ఇంటర్వ్యూలో ‘ఆదిపురుష్’ గురించి చెప్పిన మాటలు అభిమానులకు గూస్ బంప్స్ ఇస్తున్నాయి.
‘ఆదిపురుష్’ షూటింగ్ సందర్భంగా .. తొలిసారి ప్రభాస్ రాముడి అవతారంలో కనిపించినపుడు అందరూ స్టన్ అయిపోయినట్లు శీను వెల్లడించాడు ప్రభాస్ రాముడి గెటప్ వేసుకుని అలా నడిచి వస్తుంటే.. రోమాలు నిక్కబొడుచుకున్నాయని.. ఆ గెటప్‌లో అంత అద్భుతంగా కనిపించాడని ప్రభాస్ శీను తెలిపాడు.
“ఆదిపురుష్ సినిమా నెక్స్ట్ లెవెల్. అది మామూలుగా ఉండదు. ప్రభాస్ గారికి ఉన్న ఆరాకు పర్ఫెక్ట్ యాప్ట్ అనిపించే సినిమా అది. మేమందరం రాముడి గెటప్‌లో ఆయన్ని చూసి మెస్మరైజ్ అయిపోయి అలా నిలబడి ఉండిపోయాం. ఇలాంటి వ్యక్తి పక్కన మేమున్నామా అనిపించింది. డైరెక్టర్ గారు కూడా ఆశ్చర్యపోయి అలా చూస్తుండిపోయారు. అందరికీ గుండె జలదరించింది. ఇలాంటి పాత్ర చేయడం ప్రభాస్ గారి అదృష్టం” అని ప్రభాస్ శీను తెలిపాడు.
ఇదే సమయంలో ఓం రౌత్ ఒక బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ ‘ఆదిపురుష్’ గురించి, అందులో ప్రభాస్ నటన గురించి ఒక రేంజిలో ఎలివేషన్ ఇచ్చాడు. “మేం షూట్‌కు వెళ్లడానికి చాలాసార్లు లుక్ టెస్ట్ చేశాం. అందుకోసం చాలా సమయం వెచ్చించాం. ఒక పీరియడ్ ఫిలిం చేస్తున్నపుడు ఇవన్నీ జరుగుతుంటాయి. ఐతే అంతా చేశాక కూడా ప్రభాస్‌ను చూసి నాతో సహా అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి చూస్తూ ఉండిపోయాం. ప్రభాస్‌లోని స్వచ్ఛత మొత్తం అతడి కళ్లోకి వచ్చినట్లుగా అనిపించింది. తన కళ్లు ఎంతో మాట్లాడుతున్నట్లు అనిపించింది. నిజానికి అది చూసే ప్రభాస్‌తో ఈ సినిమా చేయాలనుకున్నా. అతను ఒప్పుకోకుంటే ఈ సినిమా చేసేవాడినే కాదు” అని ఓం రౌత్ తెలిపాడు.
This post was last modified on September 26, 2022 2:31 pm
తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్‌ను కత్తితో దాడి…
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…