బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ రేంజ్ ఏంటో.. ఆయనకున్న డిమాండ్ ఏంటో చెప్పడానికి ఇది ఉదాహరణ. హిందీలో సల్మాన్ నడిపించే రియాలిటీ షో ‘బిగ్ బాస్’లో ఒక్కో ఎపిసోడ్‌కు గాను సల్మాన్ ఏకంగా రూ.16 కోట్ల పారితోషకం డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
ఆ మొత్తం ఇవ్వడానికి కూడా నిర్వాహకులు సిద్ధమయ్యారట. హిందీలో అత్యంత ఆదరణ కలిగిన టీవీ షో ‘బిగ్ బాస్’యే. ఇండియాలోనే ఇది నంబర్ వన్ షో అని చెప్పొచ్చు. పది సీజన్లుగా సల్మాన్‌యే హోస్ట్‌గా ఈ షోను నడిపిస్తున్నాడు.
నాలుగో సీజన్ నుంచి ఆరో సీజన్‌కు సల్మాన్ ఒక్కో ఎపిసోడ్‌కు రూ.2.5 కోట్ల పారితోషకం తీసుకోగా.. అది తర్వాతి సీజన్లలో పెరుగుతూ వచ్చి రూ.14 కోట్లు అయింది. గత ఏడాదిలో జరిగిన 13 సీజన్‌లో 26 ఎపిసోడ్లకు గాను అతను రూ. 403 కోట్లు అందుకున్నట్లు వార్తలు వచ్చాయి.
గతంలో ఎన్నడూ లేని స్థాయిలో 2019 సీజన్‌కు టీఆర్పీ రేటింగ్స్ రావడం, భారీగా ఆదాయం సమకూరడంతో నిర్వాహకులు ఈసారి బిగ్ బాస్‌ను ఇంకో ఐదు వారాలకు పొడిగిస్తున్నట్లు సమాచారం. తనకు ఇంకా డిమాండ్ పెరగడంతో సల్మాన్ ఈసారి ఎపిసోడ్‌కు రూ.16 కోట్ల పారితోషకం డిమాండ్ చేయగా.. దానికి అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది.
ఈసారి షోపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. కరోనా కారణంగా షో నిర్వహణపై పలు అనుమానాలు తలెత్తాయి. ఐతే గత నెలలో ప్రభుత్వాలు షూటింగ్‌లకు అనుమతివ్వడంతో ఈ ఏడాది అక్టోబర్ నుంచి బిగ్‌బాస్ షో ఆరంభించాలని.. అంతకంటే ముందే చిత్రీకరణ మొదలుపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.
పార్టిసిపెంట్లందరికీ కరోనా పరీక్షలు చేసి.. అందరూ సేఫ్ అనుకున్నాకే బిగ్ బాస్ హౌస్‌లోకి పంపనున్నారని.. వాళ్లకు ఏ రకంగానూ కరోనా సోకకుండా జాగ్రత్తగా షోను నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. సల్మాన్ ఖాన్ పన్వెల్ ఫామ్‌హౌస్‌లోనే ఈ బిగ్‌బాస్ సీజన్ 14 షూటింగ్‌ని నిర్వహించనున్నట్లు సమాచారం.
This post was last modified on July 7, 2020 5:08 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…