మొదటిసారి నందమూరి బాలకృష్ణ యాంకర్ గా మారి ఆహా కోసం చేసిన అన్ స్టాపబుల్ టాక్ షో ఎంత పెద్ద బ్లాక్ బస్టరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఊహించిన దానికన్నా డబుల్ ఎనర్జీతో దాన్ని నడిపించిన తీరు ఆ ఓటిటికి ఇచ్చిన మైలేజ్ చాలా పెద్దది.
సెలబ్రిటీలతో సంభాషించిన విధానం, చలాకిగా హుషారుగా నడిపించిన వైనం భారీ వ్యూస్ ని తీసుకొచ్చింది. ప్రమోషన్లకు వచ్చిన యూనిట్లతో సైతం సరికొత్త విషయాలు చెప్పించి మూవీ లవర్స్ కి, అభిమానులకు జోష్ తీసుకొచ్చారు. త్వరలోనే దీనికి సెకండ్ సీజన్ రెడీ అవుతోంది.
ఈసారి మొదటి ఎపిసోడ్ కోసం సమంతాను తీసుకొచ్చేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇన్ సైడ్ టాక్. వాస్తవానికి పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ సెట్ చేయాలని చాలా ట్రై చేశారట. అయితే పవర్ స్టార్ డైరీ ఫుల్ ప్యాక్ అయ్యుంది.
దానికి తోడు ప్రస్తుత రాజకీయ వాతావరణంలో బాలకృష్ణ రన్ చేసే షోకు అతిథిగా వెళ్తే జరిగే పరిణామాల గురించి కూడా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఆ కారణం వల్లే అలోచించి చెప్తామనే కబురు వెళ్లిందట. అందుకే వాళ్ళిద్దరి స్థానంలో సామ్ ని తీసుకురావాలని ప్లాన్. ఇదే ఆహా కోసం సమంతా గతంలో సామ్ జామ్ చేసిన సంగతి తెలిసిందే.
ఆ బాండింగ్ ఎలాగూ ఉంది కాబట్టి ఇప్పుడు వస్తే షోకి మంచి రేటింగ్స్ ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. విడాకులు తీసుకున్నాక సామ్ ఇలా ఇంటర్వ్యూ ఇచ్చింది ఒక్క కరణ్ జోహార్ కు మాత్రమే. ఎందరో ట్రై చేసినా నో చెబుతూ వచ్చింది. ఇప్పుడు ఆహాతో పాటు బాలయ్య కాంబో అంటే వద్దని చెప్పడానికి రీజన్ ఉండకపోవచ్చు.
ఒకవేళ నిజంగా జరిగితే ఇద్దరి మధ్య ఎలాంటి చిట్ ఛాట్ ఉంటుందోననే ఆసక్తి సహజంగానే ఆడియన్స్ లో కలుగుతుంది. సినిమాల కంటే ఎక్కువగా రియాలిటీ షోలు, ముఖాముఖీల మీద ఆధారపడుతున్న ఆహా ఈ రెండో సిరీస్ ని భారీగా ప్లాన్ చేస్తోంది.
This post was last modified on September 25, 2022 4:31 pm
ఖేల్ రత్న అవార్డులు: గుకేశ్, మను బాకర్ సహా నలుగురికి గౌరవం భారత ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను మేజర్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన అభిమానులకు అద్భుత సందేశం ఇచ్చారు. తనను అభిమానిం చేవారు... తప్పకుండా పాటించాలని…
ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్, మోస్ట్ హైప్డ్ మూవీకి ఈ రోజే ముహూర్త వేడుక ముగిసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు…
ఇప్పుడంతా ఇంటర్ నెట్ ప్రపంచం. కొన్ని నిముషాలు మొబైల్ డేటా లేకపోయినా, ఇంట్లో వైఫై పనిచేయకపోయినా ఏదో భూమి బద్దలైపోయి…
ఈ సోషల్ మీడియా కాలంలో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి కూడా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అయిపోతుంటాయి.…