తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ఉన్నట్లుండి పాత సినిమాల రీరిలీజ్ హంగామా నడుస్తోంది. తమ హీరోల పుట్టిన రోజులకు వాళ్ల బ్లాక్ బస్టర్ సినిమాలకు అభిమానులు అక్కడక్కడా ఒకట్రెండు స్పెషల్ షోలు ప్లాన్ చేసి సందడి చేయడం మామూలే. కానీ ఈ మధ్య వందల థియేటర్లు, షోలు ప్లాన్ చేసి అభిమానులు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. హంగామా అంతా గత నెలలో సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా పోకిరి సినిమా స్పెషల్ షోలతో మొదలైంది. అప్పుడు ఆ యుఫోరియా అంతా చూసి మిగతా హీరోల అభిమానులకు కూడా ఆశ పుట్టింది.
ఈ నెల 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు జల్సా సినిమా స్పెషల్ షోలతో చేసిన రచ్చ వేరే లెవెల్ అనే చెప్పాలి. వరల్డ్ వైడ్ ఈ సినిమాకు దాదాపు 700 దాకా షోలు పడ్డాయి. రూ.3 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ఇక పోకిరి, జల్సా షోలు పడ్డ థియేటర్లలో అభిమానులు చేసిన సందడి గురించి ఎంత చెప్పినా తక్కువే.
ప్రస్తుతం బాలయ్య అభిమానులు ‘చెన్నకేశవరెడ్డి’ సినిమా షోలతోనూ బాగానే హడావుడి చేస్తున్నారు. దీని తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానుల సందడే చూడబోతున్నాం. పవన్ కెరీర్లో కల్ట్ మూవీ, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన ‘ఖుషి’ సినిమాకు స్పెషల్ షోలు పడబోతున్నాయి. ఐతే అందుకోసం మళ్లీ పవన్ పుట్టిన రోజు వరకు ఎదురు చూడాల్సిన పని లేదు. ఇంకో మూడు నెలల్లోనే ఖుషి సందడి చూడబోతున్నాం. డిసెంబరు 31న ‘ఖుషి’ ప్రత్యేక ప్రదర్శనలకు రంగం సిద్ధమవుతోంది.
‘జల్సా’ కంటే పెద్ద స్థాయిలో ఈ షోలు ఉంటాయట. ఈ సినిమాలో ప్రతి సీన్, ప్రతి పాటా, ప్రతి ఫైట్ అభిమానులను ఉర్రూతలూగించేదే. ఇప్పుడు చూసినా చాలా తాజాగా అనిపించే ఈ కల్ట్ మూవీలో ఫ్యాన్ మూమెంట్స్ కు లెక్కే లేదు. కాబట్టి డిసెంబరు 31న పవర్ స్టార్ ఫ్యాన్స్ సందడి మామూలుగా ఉండదనే చెప్పాలి. ఐతే ఈ హంగామా ఒక్క రోజుకు పరిమితం కాకపోవచ్చని మూణ్నాలుగు రోజులు రచ్చ చేయాలని పవన్ ఫ్యాన్స్ ప్రణాళికలు రచించుకుంటున్నారని సమాచారం.
This post was last modified on September 24, 2022 8:56 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…