Movie News

మొన్న రామ్ ఇవాళ శ్రీవిష్ణు

మన దేశంలో ఎన్టీఆర్ మొదలుకుని సాయికుమార్ పోలీస్ స్టోరీ దాకా టాలీవుడ్ లో ఎన్ని ఖాకీ దుస్తుల కథలు వచ్చాయో లెక్క బెట్టడం కష్టం. వీటిలో బ్లాక్ బస్టర్లు ఉన్నాయి డిజాస్టర్లూ పడ్డాయి. కాకపోతే హీరో ఇమేజ్ కు తగ్గట్టు కథా కథనాలు, ప్రెజెంటేషన్ ఉంటే ప్రేక్షకులు ఎప్పుడూ వీటికి బ్రహ్మరధం పడుతూనే ఉన్నారు. కాకపోతే ఇవన్నీ ఒకే ఫార్ములాలో ఒక ఫార్మాట్ ప్రకారం ఉంటాయి. అందుకే కాలం మారే కొద్దీ ఈ బ్యాక్ డ్రాప్ లో ఇంకేం చేయడానికి లేదని గుర్తించి అగ్ర దర్శకులు దీని జోలికి వెళ్లడం మానేశారు. రవితేజ విక్రమార్కుడు తర్వాత ఆ స్థాయిలో మేజిక్ చేసినవేవీ పెద్దగా లేవు.

ఇప్పుడీ ప్రస్తావన రావడానికి కారణం మన యూత్ హీరోలు ఈ జానర్ జోలికి వెళ్లి చేతులు కాల్చుకోవడం గురించి. ఆ మధ్య ఎనర్జిటిక్ స్టార్ రామ్ తమిళ దర్శకుడు లింగుస్వామిని గుడ్డిగా నమ్మి ది వారియర్ రూపంలో కెరీర్ బిగ్గెస్ట్ ఫ్లాప్ అందుకున్నాడు. దాని తాలూకు నష్టాలు మాములుగా పడలేదు. తాజాగా శ్రీవిష్ణు అల్లూరితో వచ్చాడు. తన పెర్ఫార్మన్స్ గురించి మంచి మార్కులు పడుతున్నాయి కానీ స్టోరీ సెటప్ అంతా రొటీన్ గానే ఉండటంతో అధిక శాతం ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. దానికి తోడు మూడు గంటలకు దగ్గరగా ఉన్న నిడివి మైనస్ అయ్యింది.

ఇకనైనా స్టార్లు అప్ కమింగ్ కథానాయకులు వీటి జోలికి వెళ్లేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవడం ఆవసరం. టీవీ ఛానల్స్ లో అంకుశం, కర్తవ్యం, పోలీస్ స్టోరీ లాంటివి పదే పదే వస్తున్నప్పుడు తిరిగి అవే కథల్లో మళ్ళీ కనిపిస్తామంటే చూసే ఓపిక ఇప్పటి జనంలో లేదు. అల్లూరిలో కొన్ని ఎపిసోడ్స్ బాగానే ఉన్నప్పటికీ ఓవరాల్ అవుట్ ఫుట్ గొప్పగా లేకపోవడంతో శ్రీవిష్ణు పడిన కష్టమంతా వృథా అయ్యింది. క్రాక్ అంటే రవితేజ మాస్ అప్పీల్, గోపీచంద్ మలినేని థ్రిల్లింగ్ ట్విస్టులతో ఆడింది కానీ శ్రీవిష్ణు లాంటి మాస్ కి సూట్ కానీ టాలెంటెడ్ హీరో చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది.

This post was last modified on September 24, 2022 8:30 pm

Share

Recent Posts

నాన్న, అమ్మ, కొడుకు.. ఇప్పుడు కూతురు కూడా

సినిమా కుటుంబాల నుంచి వారసులు ఇండస్ట్రీలోకి రావడం చాలా మామూలు విషయం. ఐతే ఒక కుటుంబంలో తండ్రి హీరోగా, తల్లి…

3 minutes ago

టికెట్ల రేట్ల ఎఫెక్ట్ చూశారా?

తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…

9 hours ago

ఇంతకీ అలియాస్ రుక్మిణి ఎవరు?

ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…

11 hours ago

కోన మీద కోపం తగ్గిందా?

కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…

11 hours ago

సామాజిక వ‌ర్గ రాజ‌కీయం క‌లిసొచ్చిందా జ‌గ‌న్‌… ?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఒక‌వైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచ‌న చేస్తామంటే కుదురుతుందా? అంటే కాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. కానీ,…

12 hours ago

చరణ్ కోసం అనిరుధ్ బెస్ట్ ఇవ్వాల్సిందే

పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…

15 hours ago