ఒకే తరహా కథలతో మళ్లీ మళ్లీ సినిమాలు రావడం మామూలే. ఐతే మన జనం పెద్దగా చూడని వేరే భాష నుంచి ఐడియాలు కాపీ కొట్టి తీసేవాళ్లు కొందరైతే.. అందరూ చూసిన సినిమా కథ నుంచే స్ఫూర్తి పొంది.. డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో సినిమాలు తీసేవాళ్లు కొందరు. అలా కాకుండా అప్పుడప్పుడూ ఒకే టైంలో ఒకే రకమైన కథతో రెండు సినిమాలు తెరకెక్కడం మాత్రం అరుదైన విషయమే. ఇప్పుడు అలాంటి అరుదైన చిత్రమే చోటు చేసుకుంది.
కొన్ని నెలల కిందటే విడుదలైన నాని సినిమా అంటే సుందరానికీ.. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కృష్ణ వృంద విహారికి కథ పరంగా చాలా దగ్గరి పోలికలు ఉండడం విశేషం. నాని సినిమా చూసిన వారికి.. కృష్ణ వృంద విహారి చూస్తుండగా.. అందులోని సన్నివేశాలు కళ్ల ముందు కదలాడుతున్నట్లే అనిపిస్తే ఆశ్చర్యమేమీ లేదు.
అందులో ఇందులో హీరో సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అబ్బాయి. ఇంట్లో కట్టుబాట్లతో అతను సతమతం అయిపోతుంటాడు. ఏం చేయాలన్నా ఆచారాలు, మడి అంటుంటారు. అందులో, ఇందులో బామ్మ పాత్ర సేమ్ టు సేమ్ లాగా ఉంటుంది. నాని సినిమాలో హీరోను తండ్రి సతాయిస్తే.. ఇక్కడ తల్లి ఇబ్బంది పెడుతుంది. ఇక కథానాయికకు పిల్లలు పుట్టరని తెలిసి తనకు లోపం ఉందని హీరో అబద్ధం చెప్పి పెళ్లికి ఒప్పించడం అనే పాయింట్ రెండింట్లోనూ సేమ్ టు సేమ్ అన్నమాట. కాకపోతే ఈ పాయింట్ ను డీల్ చేసిన విధానంలో కొంచెం తేడా ఉంది.
అంటే సుందరానికీలో కామెడీ ఉన్నప్పటికీ కథ కొంచెం ఇంటెన్స్ గా సాగితే.. కృష్ణ వృంద విహారి పూర్తిగా లైటర్ వీన్లో నడుస్తుంది. ఈ రెండు చిత్రాలు కాస్త అటు ఇటుగా ఒకే టైంలో మొదలయ్యాయి. కాకపోతే నాని సినిమా ముందు రిలీజైంది. నాగశౌర్య మూవీ కొంచెం ఆలస్యంగా వచ్చింది. ఇలా ఇద్దరు దర్శకులు ఒకే టైంలో కథ, పాత్రల విషయంలో ఒకేలా ఆలోచించడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
This post was last modified on September 23, 2022 10:38 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…