తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ స్థాయి ఏంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కాక్క కాక్క మూవీతో కెరీర్ ఆరంభంలోనే గొప్ప దర్శకుల జాబితాలో చేరిపోయాడతను. ఆ తర్వాత ఏమాయ చేసావె, సూర్య సన్నాఫ్ కృష్ణన్, ఎన్నై అరిందాల్ లాంటి చిత్రాలతో లెజెండరీ స్టేటస్ తెచ్చుకున్నాడు గౌతమ్. అలాంటి దర్శకుడిని ఇంటర్వ్యూ చేస్తూ మిడిమిడి జ్ఞానంతో ఒక తెలుగు యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూయర్ వేసిన ప్రశ్న.. దానికి గౌతమ్ వేసిన జవాబు చర్చనీయాంశంగా మారాయి.
ఒక లెజెండరీ డైరెక్టర్‌ను ఇంటర్వ్యూ చేస్తున్నపుడు మినిమం రీసెర్చ్ చేయకుండా.. ఆయన తీయని సినిమా గురించి ప్రశ్న అడిగి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నాడు ఆ ఇంటర్వ్యూయర్. దానికి గౌతమ్ ఇచ్చిన సమాధానం హైలైట్ అని చెప్పాలి. ఇంతకీ ఏం జరిగిందంటే..
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన నవాబ్ సినిమాలో శింబు, విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి ముఖ్య పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ఐతే ఈ సినిమా తీసింది గౌతమ్ మీనన్ అనుకున్న ఇంటర్వ్యూయర్.. సినిమా పేరెత్తకుండా శింబు, సేతుపతి, అరవింద్ లాంటి పేరున్న ఆర్టిస్టులతో పని చేసిన అనుభవం ఎలా ఉంటుంది.. అందరినీ ఎలా కోఆర్డినేట్ చేసుకుంటారు అన్నట్లుగా ప్రశ్న అడిగాడు. ఐతే ప్రశ్న తప్పు అని చెప్పకుండా, గౌతమ్ చాలా హుందాగా మాట్లాడుతూనే ఇంటర్వ్యూయర్ పరువు తీసేశాడు.
నేను గౌతమ్ మీనన్ అయితే ఇబ్బంది పెడతారేమో కానీ.. నేను మణిరత్నం కాబట్టి శింబు అయినా, సేతుపతి అయినా ఏ టైం చెబితే ఆ టైంకి వచ్చి షూటింగ్‌లో పాల్గొంటారు అన్నాడు గౌతమ్. ఐతే గౌతమ్ ఆ మాట అన్నాక కూడా ఇంటర్వ్యూయర్‌కు విషయం బోధపడలేదు. ఈ వీడియో నిన్నట్నుంచి సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. యూట్యూబ్ ఛానెళ్ల వ్యవహారం ఇలా ఉంటుందంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
This post was last modified on September 21, 2022 9:40 pm
ఒక ఊరు నుంచి మరో ఊరుకు జాతీయ రహదారి(హైవే)పై ప్రయాణించే సమయంలో టోల్ గేట్లు దాటడం తప్పనిసరి. ఈ టోల్…
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…