Movie News

బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ కి హీరోలు లేరా ?

ప్రస్తుతం టాలీవుడ్లో చిన్న హీరో నుండి స్టార్ హీరో వరకూ ఎవ్వరూ ఖాళీగా లేరు. ఎవరు చూసిన రెండు మూడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆఖరికి విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ , సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ కూడా వరుస సినిమాలు చేస్తున్నారు. అందుకే ప్రెజెంట్ కొంత మంది దర్శకులకు హీరోలు దొరకడం లేదు. సినిమా లేదంటే , సిరీస్ ఇలా ఏదొక ప్రాజెక్ట్ తో కుర్ర హీరోలంతా బిజీగా ఉంటే భారీ లైనప్ తో స్టార్ హీరోలంతా షూటింగ్స్ లో ఉంటున్నారు.

అందుకే తాజాగా బ్లాక్ బస్టర్స్ డెలివరీ చేసి అటు ప్రేక్షకుల , ఇటు ఇండస్ట్రీ మెప్పు పొందిన దర్శకులకు హీరోలు దొరకని పరిస్థితి కనిపిస్తుంది. ‘పడే పడే లెచే మనసు’ తో ఫ్లాప్ అందుకున్న హను రాఘవపూడి ఈ ఏడాది ‘సీతా రామం’ తో ఓ క్లాసిక్ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. నెక్స్ట్ మైత్రి మూవీ మేకర్స్ లో హను సినిమా కన్ఫర్మ్ కానీ హీరో లేడు. హీరో దొరికితే హను దగ్గర కథ రెడీగా ఉంది. మైత్రి నిర్మాతలు ప్రస్తుతం హను కథకు సూటయ్యే హీరోని వెతికే పనిలో ఉన్నారు. ఎలాగో వారి దగ్గర హీరోల కమిట్ మెంట్స్ ఉంటాయి కానీ ప్రెజెంట్ ఎవ్వరూ ఫ్రీగా లేరు.

ఇక చందూ మొండేటి, వసిష్ఠ పరిస్థితి కూడా ఇదే. ‘కార్తికేయ 2’, ‘బింబిసార’ సినిమాలతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ అనిపించుకున్న ఈ ఇద్దరికీ గీతా ఆర్ట్స్ లో నెక్స్ట్ సినిమా ఫిక్స్. కానీ హీరోలు లేని కారణం చేత ప్రాజెక్ట్స్ లేట్ అవుతుంది. చందూ కొన్ని నెలలుగా గీతా ఆర్ట్స్ కోసం కథ రెడీ చేస్తున్నాడు. మధ్యలో విజయ్ దేవరకొండ ను చందూ చేతిలో పెట్టాలని చూశారు కానీ రౌడీ పూరితో రెండు సినిమాలు, మైత్రి లో ఒకటి సుకుమార్ తో ఇంకొకటి కమిట్ అవ్వడం, అలాగే స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు జరగాల్సి ఉండటం కారణం చేత మధ్యలో ప్రాజెక్ట్ కి బ్రేక్ పడింది. ఇప్పుడు కార్తికేయ 2 తర్వాత చందూ కి హిందీలో మంచి మార్కెట్ క్రియేట్ అయింది. సో రెండు లాంగ్వేజెస్ కి సూటయ్యే హీరోను అతని చేతిలో పెట్టాలని అల్లు అరవింద్ , బన్నీ వాస్ ఆలోచిస్తున్నారని తెలుస్తుంది.

ఇక వసిష్ఠ దగ్గర కొన్ని ఐడియాస్ ఉన్నాయి. గీతా ఆర్ట్స్ లో హీరో సెట్ అవ్వడమే ఆలస్యం వసిష్ఠ పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసేస్తాడు. ప్రస్తుతానికి వసిష్ఠ కి కూడా హీరో దొరకడం కష్టంగానే ఉంది. స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలు కూడా రెండు మూడు సినిమాలతో బిజీ గా ఉండటమే దీనికి ప్రధాన కారణం. మరి ఈ ముగ్గురికి హీరోలు దొరికేదెప్పుడో సినిమాలు సెట్స్ పైకి వెళ్ళేది ఎప్పుడో ?

This post was last modified on September 23, 2022 12:24 pm

Share
Show comments

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

2 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

2 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

5 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

7 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

7 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

7 hours ago