తమిళంలో డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో ఎంటర్టైనింగ్ సినిమాలు తీసే దర్శకుల్లో వెంకట్ ప్రభు ఒకడు. చెన్నై-28 నుంచి మానాడు వరకు వెంకట్ ప్రభు సినిమాలంటే వేరే లెవెల్ అనే చెప్పాలి. తమిళ ప్రేక్షకులకే కాదు.. తెలుగు వారికి కూడా ఆయన మీద అభిమానం ఉంది. వెంకట్ సినిమాలు చాలా వరకు తెలుగులోకి అనువాదం అయ్యాయి. మానాడు కూడా డిజిటల్‌గా తెలుగులో రిలీజై మన ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇప్పుడు ఆయన తొలిసారిగా తెలుగులో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో అక్కినేని నాగచైతన్య హీరో అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి తెరకెక్కనుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బేనర్ మీద శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా గురించి చాన్నాళ్ల ముందే ప్రకటన వచ్చినప్పటికీ.. సెట్స్ మీదికి వెళ్లడంలో ఆలస్యం జరిగింది. ముందు ఈ చిత్రం మానాడుకు రీమేక్ అని ప్రచారం జరిగింది కానీ.. అలాంటిదేమీ లేదని.. కొత్త కథతో సినిమా తెరకెక్కనుందని వెంకట్ ప్రభు క్లారిటీ ఇచ్చాడు. ఎట్టకేలకు ఈ సినిమాకు ప్రి ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయి. బుధవారమే చిత్రీకరణ మొదలు కానుంది. ఈ సందర్భంగా ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు వెంకట్ ప్రభు. హీరోను షాడో రూపంలో చూపిస్తూ అతడి మీదికి లేజర్ లైట్లు టార్గెట్ చేసినట్లుగా పోస్టర్ డిజైన్ చేశారు. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ అనే సంకేతాలను ఈ పోస్టర్ ఇస్తోంది. ఇందులో చైతూ పోలీస్ పాత్ర చేయనున్నట్లు సమాచారం.
ఇంతకుముందు సాహసం శ్వాసగా సాగిపో సినిమాలో కొన్ని నిమిషాలు పోలీస్ పాత్రలో కనిపించడం మినహా.. చైతూ ఫుల్ లెంగ్త్ పోలీస్ పాత్ర చేసింది లేదు. మరి ఖాకీ పాత్రలో చైతూ ఎలా ఆకట్టుకుంటాడో.. అతణ్ని వెంకట్ ప్రభు ఎలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలి.
This post was last modified on September 20, 2022 3:02 pm
మహేష్ బాబు సినిమాను రాజమౌళి ఈపాటికే మొదలుపెట్టాల్సింది. కానీ పర్ఫెక్ట్ బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసిన తరువాతనే ప్రాజెక్టును స్టార్ట్…
ఐపీఎల్ మొదలైన తరువాత క్రికెట్ ప్రపంచంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. నేటితరం యువకులు అతి చిన్న వయసులోనే క్రికెట్…
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఐడియా వేస్తే.. తిరుగుండదు. అది ఎన్నికలైనా.. రాజకీయాలైనా పాలనలో అయినా.. ఆయన ఆలోచనలు…
పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గొప్ప సక్సెసయ్యాక ఇప్పుడు అందరి చూపు గేమ్ ఛేంజర్ మీదకు వెళ్తోంది.…
‘పుష్ప-2’ ట్రైలర్ లాంచ్ నార్త్ ఇండియాలో చేస్తున్నారంటే ఢిల్లీ, ముంబయి లాంటి సిటీల్లో ప్రెస్‌ను పిలిచి సింపుల్‌గా చేసేస్తారని అనుకున్నారంతా.…