సరిలేరు నీకెవ్వరుతో కమర్షియల్ విజయాన్నిఅందుకున్న అనిల్ రావిపూడి ఆ తర్వాత మరో టాప్ స్టార్ తో సినిమా చేస్తాడని అనుకున్నారు. కానీ ప్రస్తుత సూపర్ స్టార్స్ ఎవరూ అంత ఆసక్తి చూపించలేదు. దాంతో ఎఫ్ 2 సీక్వెల్ కి కథ రాసే పనిలో రావిపూడి బిజీ అయ్యాడు. ఆ కథ ఒక దారికి వచ్చేసింది కానీ… రావిపూడి మొదలు పెడదామన్నా ఇద్దరు హీరోలు అందుబాటులో లేరు.
వెంకటేష్ ఇంకా నారప్ప పూర్తి చేయలేదు. నారప్ప కోసం వెంకీ గడ్డం పెంచి గెటప్ మార్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పూర్తయ్యే వరకు ఎఫ్ 3 కోసం ఫ్యామిలీ లుక్ తో వెంకీ రాలేరు. అలాగే వరుణ్ తేజ్ కూడా బాక్సర్ గా నటిస్తున్న సినిమా కోసం బాడీ పెంచి కొత్తగా కనిపిస్తున్నాడు. అతను కూడా అది పూర్తి చేసేవరకు దొరకడు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఆ రెండు చిత్రాల షూటింగ్ ఈ ఏడాది చివరకు పూర్తయితే గొప్పే అనుకోవచ్చు. వీళ్ళు అందుబాటులో ఉండరనేది స్పష్టం కావడంతో రావిపూడి వేరే కథ, వేరే ఆప్షన్స్ మీద దృష్టి పెట్టాడని సమాచారం.
This post was last modified on July 7, 2020 10:22 am
మొన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ మెల్లగా మొదలై మంచి వీకెండ్ వసూళ్లను ఖాతాలో వేసుకునే దిశగా పరుగులు పెడుతోంది. టాక్…
ఇరుముడి రూపంలో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ కొత్త సినిమా తులాభారం ఇవాళ హైదరాబాద్ లో మొదలైపోయింది. ప్రియాంక…
కేవలం ఒక్క రోజు గ్యాప్ లో సూపర్ స్టార్ రజనీకాంత్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ వద్ద తలపడటం…
సహజంగా మూడు ఋతువులు వుంటాయి. నాలుగు నెలలు శీతాకాలం, నాలుగు నెలలు వేసవి కాలం, మరో నాలుగు నెలలు వర్షా…
ఒక్క ఫ్లాప్ కొందరు స్టార్ డైరెక్టర్ల ప్లానింగ్ ని ఎంత ప్రభావితం చేస్తుందో చెప్పడానికి లోకేష్ కనగరాజ్ ఉదాహరణ చాలు.…
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత అక్రమాస్తుల కేసులో ఈడీ స్పీడ్ పెంచడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఉన్నట్టుండి…