కన్నడ పరిశ్రమ ఎన్నడూ చూడని విధంగా పన్నెండు వందల కోట్ల వసూళ్లతో అల్టిమేట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన కెజిఎఫ్ ప్రభావం అక్కడి నిర్మాతల మీద మాములుగా లేదు. మహా అయితే ఇరవై కోట్ల లోపే పరిమితమయ్యే తమ బడ్జెట్ లను ఏకంగా యాభై అరవై దాటించేసి వందకు సైతం వెనుకాడని స్టేజికి వచ్చేశారు. అతడే శ్రీమన్నారాయణ, విక్రాంత్ రోనాలో తెలుగులో అద్భుతాలేం చేయకపోయినా శాండల్ వుడ్ లో మాత్రం భారీ వసూళ్లు రాబట్టుకున్నవే. ఈ స్ఫూర్తితో ఇప్పుడు ఫ్యాన్స్ ఉప్పిదాదా పిలుచుకునే ఉపేంద్ర కూడా రంగంలోకి దిగాడు.
కబ్జా టైటిల్ తో ప్యాన్ ఇండియా రేంజ్ లో మల్టీ లాంగ్వేజెస్ లో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ ని తాజాగా రిలీజ్ చేశారు. స్వాతంత్రం రాక ముందు అణిచివేతకు గురైన ఓ ప్రాంతంలో పుట్టి పెరిగిన ఒక గ్యాంగ్ స్టర్ డ్రామాగా దీన్ని రూపొందించారు. విజువల్స్, మేకింగ్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అన్నీ టాప్ నాచ్ లో ఉన్నాయి ప్రతి ఒక్క ఫ్రేమ్ కెజిఎఫ్ నే గుర్తుకుతెస్తోంది. కథపరంగా సంబంధం, పోలికలు ఉన్నా లేకపోయినా రెండూ ఓ సామాన్యుడు ఓ వర్గం ఆధిపత్యాన్ని ఎదిరించి పెద్ద మాఫియా డాన్ గా ఎదగడం మీద రూపొందినవే.
ఇలాంటి ఎన్ని తీసినా ప్రేక్షకులు ఎగబడి తీస్తారన్న నమ్మకమో లేక ఒక స్ట్రోక్ పడే దాకా ఇవి కంటిన్యూ అవుతాయో చూడాలి. దీని దర్శకుడు చంద్రూ. ఇతను మనకు అంతగా పరిచయం లేదు కానీ తెలుగులో ఒక సినిమా చేశాడు. సుధీర్ బాబు హీరోగా కృష్ణమ్మ కలిపింది తీసిన డైరెక్టర్ ఇతనే. ఒరిజినల్ వెర్షన్ ఛార్మినార్ అప్పట్లో పెద్ద సంచలనం. కానీ ఇక్కడ ఆడలేదు. ఉపేంద్రతో గతంలో బ్రహ్మ, ఐలవ్ యు తీశాడు. ఇవి తెలుగులో డబ్ అయ్యాయి కానీ ఎవరూ పట్టించుకోలేదు. 2019 నుంచి ఈ కబ్జా మీదే పని చేస్తున్నాడు. ఈగ సుదీప్ తో గోపాల గోపాల రీమేక్ తర్వాత ఉపేంద్ర చేస్తున్న మల్టీస్టారర్ ఇదే .
This post was last modified on September 17, 2022 10:21 pm
ఏపీలో వైసీపీ పాలనలో చీపు లిక్కరును మద్యం బాబులకు అంటగట్టి.. భారీ ధరలతో వారిని దోచేసిన విషయం తెలిసిందే. అన్నీ…
ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పలువురు మంత్రులను కలుసుకుని సాగునీటి ప్రాజెక్టులు, రైలు…
నవ్యాంధ్ర రాజధానిలో పెట్టుబడులు.. పరిశ్రమలు.. మాత్రమేకాదు.. కలకాలం గుర్తుండిపోయేలా.. ప్రముఖ పర్యాటక ప్రాంతంగా కూడా దీనిని తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు…
మూడు రాజధానుల నుంచి మద్యం వరకు.. వలంటీర్ వ్యవస్థ నుంచి సచివాలయాల వరకు.. వైసీపీ అధినేత జగన్ చేసిన ప్రయోగాలు…
వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉండే మహేష్ బాబు ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ కి బ్రాండ్ అంబాసడర్ గా పని…
ఇటీవలే విడుదలైన కేసరి చాఫ్టర్ 2కి యునానిమస్ గా పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. మూడుకు తక్కువ రేటింగ్స్ దాదాపుగా ఎవరూ…